IPL 2023 : రేపటి నుంచి పొట్టి క్రికెట్ పండుగ

హైదరాబాద్ (మార్చి – 30) : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) మార్చి 31నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు తలపడుతున్న ఈ 16వ మెగా టోర్నీలో లీగ్ దశలో 74 మ్యాచ్ లు జరగనున్నాయి. వీటితో పాటు క్వాలీపయర్ – 1, ఎలిమినేటర్‌, క్వాలీపయర్ – 2, ఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

గతేడాది తొలి ప్రయత్నంలోనే టైటిల్ కైవసం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ జట్టు నాలుగు సార్లు ఐపీఎల్ విజేత అయినా చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ను ఆహ్మదాబాద్ వేదికగా ఆడనుంది.

ఈ టోర్నీ మొదటి విజేతగా రాజస్థాన్ రాయల్స్ నిలవగా, 5 సార్లు ముంబై ఇండియన్స్, 4 సార్లు చెన్నై సూపర్ కింగ్స్, 2 సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్, 2 సార్లు కోల్‌కతా నైట్ రైడర్స్, ఒకసారి గుజరాత్ టైటాన్స్ విజేతలుగా నిలిచాయి.

IPL 2023 లో తలపడుతున్న జట్లు ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), సన్ రైజర్స్ హైదరాబాద్(SRH), గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్(RR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), పంజాబ్ కింగ్స్ (PKXI), లక్నో జెయింట్స్ (LG), డిల్లీ కేపిటల్స్ (DC).