ఆహ్మదాబాద్ (మే – 15) : గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ (GTvsSRH) జట్ల మధ్య జరిగిన పోరులో గుజరాత్ 34 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి ప్లే ఆప్స్ కి చేరిన తొలి జట్టుగా నిలిచింది.
హైదరాబాద్ జట్టు ఐపీఎల్ 2023 నుండి ఎలిమినేట్ అయింది. ఇప్పటికే డిల్లీ జట్టు కూడా ఎలిమినేట్ అయింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శుభమన్ గిల్ (SHUBAMAN GILL) సెంచరీ తో 188 పరుగులు సాదించింది. ఈ ఐపీఎల్ లో సెంచరీ చేసిన ఆరో బ్యాట్స్‌మన్ గా గిల్ నిలిచాడు.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 59 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్లాసెన్ & భువనేశ్వర్ ( clasen , Bhuvaneswar) భాగస్వామ్యంతో పోటీలోకి వచ్చినా క్లాసెన్ వికెట్ కోల్పోయిన తర్వాత పరాజయ బాట పట్టి 154 పరుగులు సాదించి ఓడిపోయింది.