అహ్మదాబాద్ (మే – 29) : IPL 2023 FINAL నిన్న వర్షం కారణంగా రద్దు అయిన నేపథ్యంలో నేడు రిజర్వ్ డే లో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు కూడా వాతావరణ శాఖ నివేదిక ప్రకారం వర్షాలు పడే అవకాశం ఉంది.
రిజర్వుడేలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే మొదటిసారి. ఫైనల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
◆ ఈరోజు కూడా వర్షం పడితే :
మ్యాచ్ 5 ఓవర్లకు కుదించి నిర్వహిస్తారు. అది కూడా సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ను ద్వారా విజయం నిర్ణయిస్తారు. అది కూడా సాధ్యపడకపోతే సీజన్ లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు టైటిల్ ను సొంతం చేసుకుంటుంది. దాని ప్రకారం గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ ను సొంతం చేసుకుంటుంది.