IPL 2023 FINAL : CSK vs GT

ఆహ్మదాబాద్ (మే – 26) : ఐపీఎల్ 2023 క్వాలిఫైయర్ – 2 లో గుజరాత్ టైటాన్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై ఘనవిజయం సాధించి వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరింది. ఫైనల్ లో చెన్నై జట్టు తో గుజరాత్ (ipl2023final) తలపడనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఓపెనర్ శుభమన్ గిల్ సూపర్ సెంచరీ (129) తో చెలరేగడంతో 233/3 భారీ స్కోరు చేసింది. ఈ ఐపిఎల్ లో ఇది గిల్ కి మూడవ సెంచరీ కావడం విశేషం.

అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ముంబై ఇండియన్స్ జట్టు తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ లు ఉన్నంతసేపు లక్ష్యం చేదించేలా కనపడింది. సూర్య ఔట్ అయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయి ఐపీఎల్ లో తన పోరాటం ముగించింది.

ఒక ఐపిఎల్ సీజన్ లో అత్యధిక సెంచరీల చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ, బట్లర్ పేరిట రికార్డు ఉంది. కోహ్లీ, బట్లర్ లు ఓకే ఐపీఎల్ సీజన్ లో 4 సెంచరీలు చేశారు..

ఓకే సీజన్ లో 800 కు పైగా పరుగులు సాధించిన రెండో భారత బ్యాట్స్ మెన్ గా శుభమన్ గిల్ (859) నిలిచాడు. మొదటి బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు.

ఐపీఎల్ ఫైనల్ 2023 లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @