ఐపీఎల్ 14వ సీజన్ పండుగ ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా అట్టహాసమైన ఆరంభోత్సవాలకు, ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ మైదానాలలో ముంబై, బెంగళూరు పోరుతో ఈ ఏడాది సీజన్ ఆరంభం కానుంది.
ఈ ఏడాది ఐపీఎల్ ఆరు వేదికల్లో జరుగనుంది. ముంబై, చెన్నై ఆ తర్వాత అహ్మదాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.
ఐదు సార్లు టైటిల్ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది.
ఐపీఎల్ రికార్డులు
● అత్యధిక పరుగులు
1) కోహ్లీ (ఆర్సీబీ) 5,878
2) సురేశ్ రైనా (సీఎస్కే) 5,368
3) వార్నర్ (ఎస్ఆర్హెచ్) 5,254
4) రోహిత్ శర్మ (ముంబై) 5,230
● అత్యధిక సిక్స్‌లు
1) గేల్ (పంజాబ్) 349
2) డివిలియర్స్ (ఆర్సీబీ) 235
3) ధోనీ (సీఎస్కే) 216
4) రోహిత్ (ముంబై) 213
● అత్యధిక వికెట్లు
1) మలింగ (ముంబై) 170
2) అమిత్ మిశ్రా (ఢిల్లీ) 160
3) పియూశ్ చావ్లా (ముంబై) 156
4) బ్రావో (సీఎస్కే) 153