ఇంటర్ పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థులు వెబ్సైట్ నందు వివరాలు చెక్ చేసుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ జనరల్ మరియు ఒకేషనల్ కోర్సుల్లో పబ్లిక్ పరీక్షల కొరకు ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం పీజు కట్టిన విద్యార్థులు తమ యొక్క వివరాలను ఇంటర్మీడియట్ వెబ్సైట్ (https://tsbie.cgg.gov.in/home.do) నందు చెక్ చేకోవాల్సిందిగా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.

వెబ్సైట్ నందు “IPE 2021 స్టూడెంట్స్ చెక్ లిస్ట్” నందు ప్రథమ సంవత్సరం విద్యార్థులు పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టినరోజు నమోదు చేయడం ద్వారా తమ యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఇంటర్ ప్రధమ సంవత్సరం హాల్ టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా వారి యొక్క డీటెయిల్స్ వారు కట్టిన పరీక్ష ఫీజు సబ్జెక్టుల వివరాలు పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ ను సంప్రదించి వివరాలను సరి చేపించుకోవాలని పేర్కొన్నారు.

అలాగే సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్స్ కూడా ఒకసారి పరీక్ష ఫీజు కట్టిన విద్యార్థుల వివరాలను చెక్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కమీషనర్ ఉమర్ జలీల్ కోరారు.

Website :: https://tsbie.cgg.gov.in/home.do

Follow Us@