- వొకేషనల్ విద్యార్థులకు అవకాశం
- తొలిదశలో రిటైల్ మార్కెటింగ్‌లో 2,600 మంది విద్యార్థులకు చాన్స్
- ఇంటర్న్‌షిప్ పూర్తికాగానే ప్లేస్‌మెంట్స్
- ఈ విద్యాసంవత్సరం నుంచి అమలు
Source ntnews
ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లోని విద్యార్థులకు చదువు పూర్తికాగానే ప్లేస్‌మెంట్స్ కల్పించాలని ఇంటర్ విద్య అధికారులు నిర్ణయించారు. దాంతో ఇంటర్ చదువుతూనే ఇంటర్న్‌షిప్‌కు అవకాశం ఇస్తున్నారు. వొకేషనల్ కోర్సు ‘రిటైల్ మార్కెటింగ్’ పూర్తిచేసిన వారికి ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఇందుకు రిలయన్స్ సంస్థ సహకారాన్ని తీసుకొంటున్నారు. రిలయన్స్ స్టోర్స్, మాల్స్‌లలో ఇంటర్న్‌షిప్ పూర్తికి అవకాశం ఇస్తున్నారు. తర్వాత దశలవారీగా రిలయన్స్ డిజిటల్, ఫార్మాలోనూ ఇంటర్న్‌షిప్ కల్పిస్తారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల కోరిక మేరకు వాటిల్లోనే ప్లేస్‌మెంట్స్ ఇస్తారు. ఇలా 2,600 మంది విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్న్‌షిప్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు.
ఇంటర్న్‌షిప్ ఇలా.
రిటైల్ మార్కెటింగ్ కోర్సులోని విద్యార్థులు ఫస్టియరంతా కాలేజీలోనే చదువుతారు. వీరికి థియరీ క్లాసులు ఉంటాయి.
సెకండియర్ విద్యార్థులకు థియరీతోపాటు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు.
ఇంటర్న్‌షిప్‌లో వారంలో రెండు రోజులు పూర్తిగా థియరీ క్లాసులు, మిగతా నాలుగు రోజుల్లో ఉదయం థియరీ క్లాసులు నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ఇంటర్న్‌షిష్ ఉంటుంది.
ఇంటర్న్‌షిప్‌లో విద్యార్థులు పనిచేసిన సమయాన్ని బట్టి గంటకు కొంత చొప్పున లెక్కించి షాపింగ్ కూపన్లు ఇస్తారు. వాటితో తమకు కావాల్సిన వస్తుసామాగ్రిని కొనుగోలు చేయవచ్చు.
ఈ కోర్సు పూర్తిచేసిన తర్వాత రిలయన్స్ స్టోర్స్‌లలోనే ప్లేస్‌మెంట్స్ కల్పిస్తారు. ఉన్నత చదువుల కోసం రియలన్స్ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్ కోర్సులో చేరవచ్చు.
Follow Us @