సాంకేతికతతో లింగ సమానత్వం : అస్నాల శ్రీనివాస్

  • (మార్చ్ 8 మహిళా దినోత్సవ ఇతివృత్త వ్యాసం )
    అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం

BIKKI NEWS : ప్రపంచ దేశాలు ప్రతి ఏటా మార్చ్ 8 మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహిస్తాయి. ఈ సందర్భంగా మహిళా విమోచన ఉద్యమాలలో సాధారణ మహిళలు, సంఘ సంస్కర్తలు తమ ధైర్యంతో సాహసంతో సాధించిన అసాధారణ విజయాలను మననం చేసుకోవడానికి ఒక వేదికగా ఉపయోగించుకుంటాయి. ప్రభుత్వాలు పౌర సంస్థలు భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

ప్రజలే చరిత్ర నిర్మాతలు, ఆ ప్రజలలో సగం మహిళలు . ఆదిమ దశ నుండి నేటి ఆధునిక, ఆధునికాంతర దశ వైపు పురోగమిస్తున్న సమాజ పరివర్తన పోరాటాల ప్రస్థానంలో మహిళలు తమదైన పాత్రను పోషించారు. – అస్నాల శ్రీనివాస్,

ప్రజలే చరిత్ర నిర్మాతలు, ఆ ప్రజలలో సగం మహిళలు . ఆదిమ దశ నుండి నేటి ఆధునిక, ఆధునికాంతర దశ వైపు పురోగమిస్తున్న సమాజ పరివర్తన పోరాటాల ప్రస్థానంలో మహిళలు తమదైన పాత్రను పోషించారు. పోరాట ఫలితాలను పుర్తిగా అందుకోవడంలో వెనుకబడిపోతున్నారు. ప్రకృతి విపత్తులు మహమ్మారి లు ప్రబలిన కాలాలలో పెను ప్రభావానికి స్త్రీలు లోనవుతున్నారు. ప్రతికూల స్థితులలో నిలదొక్కుకుంటూ పోతున్న ప్రతి సందర్భంలో వారి మనుగడ వికాసానికి ఎదో ఒక సవాల్ ఎదురవుతూనే ఉన్నది. అలాంటి సవాల్ లో ఒకటి డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం.

మహిళల సాధికారతకు గుర్తుగా, మహిళలు ఎదుర్కొనే సమస్యల ఫలితంగా, వివక్షతకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమం నుండి పుట్టింది మహిళా దినోత్సవం. – అస్నాల శ్రీనివాస్,

మహిళల సాధికారతకు గుర్తుగా, మహిళలు ఎదుర్కొనే సమస్యల ఫలితంగా, వివక్షతకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమం నుండి పుట్టింది మహిళా దినోత్సవం. 1908 లో మెరుగైన జీవితం, తక్కువ పనిగంటలు, ఓటు హక్కుల కొరకై మొదట న్యూయార్కులో తమ సమస్యలకై పోరాడారు. 1910 ప్రతీ సంవత్సరం ఏదో ఒకరోజు అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం జరుపుకోవాలని సూచించిన మహిళ -క్లారా జెట్కిస్. 1910 కోపెన్ హగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్స్ సదస్సులో ఆమె ప్రతిపాదన చేయగా దానిని 100మంది పలు దేశాలకు చెందిన మహిళలు ఏకగ్రీవంగా అంగీకరించారు. దాని ఫలితంగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని ఆనాడు జరిపారు. 1913 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించగా కొన్ని దేశాల్లో యాంటి సెక్సిజం డే గా ఇంకొన్ని దేశాల్లో వివక్ష వ్యతిరేక దినోత్సవంగా ఇంకొన్ని దేశాల్లో సివిల్ అవేర్ నెస్ డే గా మహిళల హక్కులకై సమ్మె ప్రారంభించిన రోజును పిలుస్తున్నారు.

1975 సంవత్సరాన్ని “గతాన్ని వేడుక చేసుకోవడం భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం” అనే ఇతివృత్తంతో మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది.అస్నాల శ్రీనివాస్,

1917లో రష్యా మహిళలు ఆహారం -శాంతి నినాదం చేస్తూ సమ్మె ప్రారంభించారు. రష్యా వారు అనుసరించే జూలియస్ క్యాలెండర్ ప్రకారం సమ్మె ప్రారంభించిన రోజు ఫిబ్రవరి -23(ఆదివారం) ఇప్పుడు అమలులో ఉన్న గ్రెగెరియన్ క్యాలెండర్ ప్రకారం అది మార్చి 8 . సమ్మెలు పోరాటాల ఫలితంగా 1975 సం॥ లో ఐక్యరాజ్య సమితి ప్రతీ సంవత్సరం ఒక ప్రధాన ఇతివృత్తాన్ని ఎంచుకోవాలని ఆదిశగా అభివృద్ధి సాధించాలని నిర్ణయించి 1975 సంవత్సరాన్ని “గతాన్ని వేడుక చేసుకోవడం భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం” అనే ఇతివృత్తంతో మార్చి 8 ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది.

అంతర్జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవం జరుపుకోవాలని సూచించిన మహిళ -క్లారా జెట్కిస్. అస్నాల శ్రీనివాస్,

ప్రపంచాన్ని శాంతి కాముకంగా సుందరమయంగా న్యాయబద్ధంగా మార్చడంలో సాంకేతిక నైపుణ్యాలు జ్ఞానం తోడ్పడుతుంది.యు యాన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలైన పేదరికమును అంతం చేయడం మాతృ శిశు మరణాల రేటు తగ్గించడం ,అందరికి విద్య ,ఉపాధి ,సుస్థిర సమ్మిళిత వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి మొదలగు వాటి సాధనను వేగవంతం చేయడానికి దోహదపడుతుంది.అదే సమయంలో ఈ సాంకేతికత వ్య్వక్తిగత గోప్యత భద్రత కు భంగం కలిగించే ధోరణులు ,అసమానతను పెంచే విధంగా కూడా ప్రభావాన్ని కలిగిస్తున్నాయి.ఈ నేపథ్యంలో
ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం 2023 సంవత్సరాన్ని అందరి మహిళలకి డిజిటల్ అక్షరాస్యత -“లింగ సమానత్వం సాధనలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలు “అనే ఇతివృత్తాన్ని ప్రకటించింది.అలాగే ప్రచార ఇతివృత్తంగా సమాన అవకాశాలు ఇంకా సరిపోవు,సమత్వాన్ని స్వీకరించండి “అనే పిలుపును ఇచ్చింది.

“కంప్యూటర్ ,స్మార్ట్ ఫోన్ , ఇంటర్నెట్ ,వెబ్సైట్ ,ఈ కామర్స్ ,సాఫ్ట్వేర్ అప్ ల వినియోగం మొదలగు అంశాలు తెలిసి ఉపయోగించడాన్ని డిజిటల్ అక్షరాస్యతగా పరిగణిస్తారు.” అస్నాల శ్రీనివాస్,

సాంకేతికత మానవ జీవనంలో అనివార్యమైన అవసరంగా మారింది.సామాజిక ఆర్ధిక అసమానతలను తగ్గించడంలో ,మహిళల హక్కుల రక్షణలో డిజిటల్ సాధనాల పాత్ర పై వాటి వినియోగంలో స్త్రీల పాత్ర పెంపు పై మేధోమధన సదస్సులను నిర్వహించాలని సూచిందింది.కంప్యూటర్ సాంకేతిక వర్చువల్ కృత్రిమ మేధ రంగాలలో స్త్రీల కృషి తగినతంగా ఉన్నప్పటికీ వారి సేవలకు గుర్తింపుకు నోచుకోలేదు. సైన్స్ టెక్నాలజి ఇంజనీరింగ్ గణిత రంగాలలో 35% మహిళలు ఉన్నారు.కానీ డిజిటల్ కంప్యూటర్ రంగాలలో ప్రపంచ వ్యాప్తంగా 3% మాత్రమే మహిళల వాటా ఉన్నది.ఇంటర్నెట్ వాడకం లో మహిళల వాటా 12%మాత్రమే.డిజిటల్ సాంకేతికత వలన ప్రతి ఏటా వ్యవసాయం ఆరోగ్యం పర్యావరణం నావిగేషన్ బిల్లులు చెల్లించే ప్రక్రియలలో 40 మిలియన్ ఉద్యోగాలు సృష్టించ బడుతున్నాయని అదే సమయంలో పారిశ్రామిక రంగంలో డిజిటల్ ఆటోమేషన్ వలన వందల మిలియన్ ల ఉద్యోగాలు కోల్పోతున్నారని మెకిన్సీ సంస్థ తెలియచేసింది.STEM (science technology engineering mathematics) రంగాలలో వాటి ఆధారిత సమాచార సాంకేతిక రంగాలలో నైపుణ్యాల అభ్యసనకి మహిళలకు జీవిత పర్యంత శిక్షణ అవసరం.

డిజిటల్ విద్యలో మహిళలకి ప్రవేశం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలి.ఇది వారి హక్కుల పౌర స్పృహను పెంచుతుంది .అస్నాల శ్రీనివాస్,

అణగారిన శ్రామిక వర్గాల మహిళలలో గొప్ప శక్తి సామర్ధ్యాలు ఉంటాయని,సమస్యలకి సృజనాత్మక పరిష్కారాలు ఇవ్వడంలో ప్రతిభ కనపర్చుతారని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.మానవ జ్ఞాన ప్రగతిని నూతన తరాలకు ఇవ్వడంలో ముందుంటారు .యు యన్ జెండర్ స్నాప్ షాట్ 2022 నివేదిక ప్రకారం డిజిటల్ సాంకేతికలో స్త్రీల భాగస్వామ్యం లేకపోవడం వలన మధ్య నిమ్న ఆదాయాలు కల దేశాలు తమ స్థూల జాతీయోత్పత్తి లో ఒక ట్రిలియన్ డాలర్లు నష్టం వాటిల్లింది అని తెలియచేసింది.ఇది నిర్లక్ష్యం వహిస్తే 2025 నాటికి 1.5 ట్రిలియన్ కు చేరుతుంది అని హెచ్చరించింది.కావున డిజిటల్ విద్యలో మహిళలకి ప్రవేశం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలి.ఇది వారి హక్కుల పౌర స్పృహను పెంచుతుంది .ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు చోదకశక్తిగా మారుతుంది.లేకపోతే డిజిటల్ విద్యలోని అసమానతలు సామాజికీయ లింగ అసమానతలను మరింత తీవ్రమవుతాయి.

స్త్రీలు అన్ని రంగాలలో పాల్గొన్నప్పుడే ఆర్ధిక వ్యవస్థ సుసంపన్నమవుతుంది.స్త్రీలలో ఆత్మ విశ్వాసం ,ఉద్యోగం సొంత వ్యాపారంలతో ఆర్ధిక స్వతంత్రత ఏర్పడి సామాజిక శాంతి కలుగుతుంది.అస్నాల శ్రీనివాస్,

ఇప్పటికి సమాజంలో జ్ఞాన శాస్త్ర శాఖల ఎంపికలలో లింగ వివక్షత కొనసాగుతున్నది.సమాచార సాంకేతిక రంగాలు మహిళలకి సరిపోవు అని నిరుత్సాహ పరిచే ధోరణులు కుటుంబంలో సమాజంలో కొనసాగుతున్నాయి.గ్రామీణ మహిళలు ఆదివాసీలు భాషా మత జాతి పర మైనారిటీలలో దివ్యాంగ ట్రాన్స్ జెండర్ లలో ఈ వివక్ష ఎక్కువగా ఉంది.ఈ వివక్షతలు పోవాలంటే విధానాల రూపకల్పన నిర్ణయాధికారం ఉండే చట్ట సభలలో మహిళల వాటా పెరగాలి.

ప్రతికూల స్థితులలో నిలదొక్కుకుంటూ పోతున్న ప్రతి సందర్భంలో వారి మనుగడ వికాసానికి ఎదో ఒక సవాల్ ఎదురవుతూనే ఉన్నది. అలాంటి సవాల్ లో ఒకటి డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకోవడం.అస్నాల శ్రీనివాస్

స్త్రీలు అన్ని రంగాలలో పాల్గొన్నప్పుడే ఆర్ధిక వ్యవస్థ సుసంపన్నమవుతుంది.స్త్రీలలో ఆత్మ విశ్వాసం ,ఉద్యోగం సొంత వ్యాపారంలతో ఆర్ధిక స్వతంత్రత ఏర్పడి సామాజిక శాంతి కలుగుతుంది.దీనికి డిజిటల్ అక్షరాస్యత దోహదం చేస్తుంది.మూఢనమ్మకాలు మహిళలపై అణచివేత బాల్య వివాహాలు గృహ హింస మొదలగు వాటికి వ్యతిరేఖంగా డిజిటల్ ప్రచారం చేసి అఘాయిత్యాలు తగ్గించడానికి వారి భద్రతకు దోహదం చేస్తుంది.

స్త్రీలు పాలకులుగా ఉన్న దేశాలు వారు యాజమాన్యంతో ఉన్న సంస్థలు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని చరిత్ర నిరూపిస్తున్నది.మధ్యమ ఆదాయం గల వంటి భారత్ వంటి దేశములో డిజిటల్ నైపుణ్యాలను సార్వత్రికం చేసినప్పుడు మాత్రమే విశ్వగురుగా మారుతుంది .మనుస్మృతి ని రాజ్యాంగంగా పున ప్రతిష్ట ప్రయత్నం చేస్తున్న సంఘ్ పరివార్ పాలకులతో డిజిట్ అల్ కల సాకారం అవుతుందా ..

వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం