INTERNATIONAL TIGER DAY : అంతర్జాతీయ పులుల దినోత్సవం

BIKKI NEWS (జూలై – 29) : అంతర్జాతీయ పులుల దినోత్సవం (INTERNATIONAL TIGER DAY) జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. పులుల సంరక్షణపై అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపబడుతుంది.

2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది. పులుల సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచి వారినుండి సహాయాన్ని అందుకోవడం ఈ దినోత్సవ ముఖ్యోద్ధేశ్యం.

భారతదేశంలో ప్రతి నాలుగు సంవత్సరాలకు అడవి పులుల సంఖ్యను లెక్కిస్తారు. పులుల సంఖ్య 2006లో 1411, 2010లో 1,726 ఉండగా 2014లో 2226కి పెరిగింది. 2018 నాటికి 2,967 ఉండగా ప్రస్తుతం 2022 నాటికి 3,167 పులులు ఉన్నట్లు అంచనా వేశారు.