BIKKI NEWS (JUNE 23) : INTERNATIONAL OLYMPIC DAY JUNE 23rd. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఏర్పాటుకు గుర్తుగా ప్రతి సంవత్సరం జూన్ 23న ‘అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం’గా నిర్వహిస్తారు. 1948లో స్విట్జర్లాండ్ లో జరిగిన ఐఓసీ 42వ సమావేశంలో ఏటా జూన్ 23న ‘అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం’గా నిర్వహించాలని తీర్మానించారు.
INTERNATIONAL OLYMPIC DAY JUNE 23rd.
ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా పండుగగా ఒలింపిక్స్ ను పేర్కొంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ పోటీల్లో పాల్గొంటాయి.
ఒలింపిక్ గేమ్స్ సాదరణంగా ప్రతి నాలుగేళ్లకోసారి జరుగుతాయి. లింగం, వయసు, క్రీడాకారుల సామర్థ్యం అనే వివక్ష లేకుండా అందరూ క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం..
ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో 33వ క్రీడలు 2024, జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు పారిస్ లో జరిగాయి. అమెరికా (126), చైనా (91)తో మొదటి రెండు స్థానాల్లో నిలవగా, భారత్ 1 రజతం, 5 కాంస్యాలు నెగ్గి మొత్తం 6 పతకాలతో 71వ స్థానంలో ఉంది.
చరిత్ర
ఒలింపిక్స్ క్రీడలు . . 776 నాటివి. గ్రీస్ లోని ఒలంపియాను వీటికి పుట్టినిల్లుగా పేర్కొంటారు. అప్పట్లో వీటిని జ్యూస్ దేవుడి గౌరవార్థం మతపరమైన వేడుకగా ప్రతి నాలుగేళ్లకోసారి నిర్వహించేవారు.
క్రీ.శ.393 వరకు ఇవి జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే యుద్దాలు, ఇతర కారణాల వల్ల ఇవి నిలిచిపోయాయి.
ఫ్రెంచ్ చరిత్రకారుడు బారన్ పియరీ కూబెర్టిన్ ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలని భావించి, 1894, జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)ని ఏర్పాటు చేశారు. మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు 1896, ఏప్రిల్ 6 నుంచి 14 వరకు గ్రీస్ లోని ఏథెన్స్ లో జరిగాయి.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్