International Day for the Elimination of Violence against Women

BIKKI NEWS (NOV 25) : సమాజంలో స్త్రీలపై వివిధ రూపాలలో జరిగే అణిచివేతలను అరికట్టే ప్రయత్నములో భాగంగా 1999 డిసెంబరు 17వ తేదీన ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని చేసింది . ప్రతి సంవత్సరము నవంబరు 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినము (International Day for the Elimination of Violence against Women) గా పాటించాలని తీర్మానము చేశారు.

చారిత్రాత్మకంగా ఈ దినాన్ని 1960లో డొమైన్ రిపబ్లిక్ లో రాజకీయ కార్యకర్తలైన మిరాబల్ సిస్టర్స్ యొక్క హత్య ఆధారంగా స్త్రీ హింసా వ్యతిరేక దినంగా పాటించడం జరిగింది. ఈ హత్యలు డొమైన్ రిపబ్లిక్ నియంత అయిన రాఫ్హీల్ ట్రుజిల్లో (1930–1961) చే 1981 లో అజ్ఞాపించబడినవి. ఉద్యమకారులు నవంబరు 25 న స్త్రీ హింసా వ్యతిరేకత గూర్చి అవగాహన కల్పించుటకు నిర్ణయించారు. 1999 డిసెంబరు 17 న ఈ దినాన్ని అధికారికంగా ఐక్యరాజ్యసమితి తీర్మానించింది.

ఐక్యరాజ్య సమితి అన్ని ప్రభుతాలను, అంతర్జాతీయ సంస్థలకు, ఎన్.జి.ఒ లకు ఆ రోజున అంతర్జాతీయ కార్యక్రమంగా మహిళలపై జరుగుతున్న హింసా వ్యతిరేక దినంగా పాటించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ప్రోత్సహించింది. ఉదాహరణకు యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ఫండ్ ఫర్ వుమెన్ (UNIFEM) ఈ దినాన్ని ప్రతి సంవత్సరం పరిశీలించి కొన్ని సలహాలను యితర సంస్థలకు యివ్వడం జరుగుతుంది.