BIKKI NEWS : INTERNATIONAL CURRENT AFFAIRS – NOVEMBER 2023 – అంతర్జాతీయ స్థాయిలో నవంబర్ – 2023లో జరిగిన వివిధ సఘటనలు, ఒప్పందాలు, సదస్సుల సమాహారంగా అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్ సమగ్రంగా మీ కోసం…
1) శ్రీలంక దేశపు లెజిస్లెటీవ్ రాజధాని నగరం ఏది.?
జ : శ్రీ జయవర్దనేపుర కొట్టే
2) FATF సంస్థ ఏ దేశాన్ని గ్రే లిస్టు నుండి తొలగించింది.?
జ : కేమన్ దీవులు
3) ఎన్ని రాఫెల్ నావల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు కోసం భారతదేశము ప్రాన్స్ తో ఒప్పందం చేసుకుంది.?
జ : 26
4) అంతర్జాతీయ మంచు చిరుతల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 23
5) 2022 సంవత్సరంలో కెనడాలో వలస వచ్చిన వారిలో అత్యధికలు ఏ దేశస్థులు.?
జ : భారతీయులు
6) గడచిన ఏడు నెలల్లో ఏ దేశంలో అత్యధికంగా 419 మందికి ఆ దేశ ప్రభుత్వం మరణశిక్ష విధించింది.?
జ : ఇరాన్
7) ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) వల్ల ఎదురయ్యే ఫలితాలను ఎదుర్కోవడానికి ఏ దేశంలో ఇటీవల సదస్సు నిర్వహించారు.?
జ : బ్రిటన్
8) ఏ దేశంలో నవంబర్ 3వ తేదీన 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.?
జ : నేపాల్
9) అమెరికాలోని ఏ నగరంలో నూతన భారత దౌత్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.?
జ : సీయాటెల్
10) ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : అక్టోబర్ 15
11) ప్రపంచంలో మహిళ నిరక్షరాస్యుల శాతం ఎంత.?
జ : 63%
12) ఇటీవల భారత్ లో పర్యటించిన భూటాన్ రాజు ఎవరు.?
జ : జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్
13) భారత్ భూటాన్ దేశాల మధ్య ఏ రైలు మార్గాలకు ప్రతిపాదనలకు భారత్ – భూటాన్ ఒప్పందం చేసుకున్నాయి.?
జ : కోక్రాఘర్ – గెలెప్
బనర్హత్ – సమత్సే
14) QUAD కూటమి ఇటీవల ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో డార్క్ షిప్పింగ్ ను నిరోధించడానికి కుదుర్చుకున్న ఒప్పందం ఏమిటి.?
జ : ఇండో పసిఫిక్ మారీ టైం డొమైన్ అవేర్నెస్
15) ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ (ISA) లో 95వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది.?
జ : చిలీ
16) ఏ సంవత్సరంలో భారత్ మరియు ప్రాన్స్ ప్రభుత్వాలు కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ను ఏర్పాటు చేశాయి .?
జ : 2015
17) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ సర్టిఫికెట్ జారీ చేసే అర్హత కలిగిన ఎన్నో దేశంగా భారత్ నిలిచింది.?
జ : 13వ
18) అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పోర్చుగల్ ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేశారు ఆయన పేరు ఏమిటి.?
జ : ఆంటోనియో కోస్టా
18) గడిచిన 20వేల సంవత్సరాల లో గ్రీన్ ల్యాండ్ చుట్టూ ఉండే ధ్రువపు ఎలుగుబంటుల జనాభా ఎంత శాతం తగ్గినట్లు ఇటీవల శాస్త్రవేత్తలు ప్రకటించారు.?
జ : 20 నుండి 40%
19) ఏ సముద్రంలో అగ్నిపర్వతం విస్పోటనం చెందడంతో కొత్త ద్వీపం ఏర్పడింది.?
జ : జపాన్ సముద్రం
20) ప్రపంచ నిమోనియా దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 13
21) ఇజ్రాయిల్ దేశం తన గగనతల రక్షణ వ్యవస్థ ‘డేవిడ్స్ స్లింగ్’ ఏ దేశానికి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకుంది.?
జ ; ఫిన్లాండ్
22) 1500 కోట్ల మొక్కలు నాకెందుకు ఏ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : కెన్యా
23) తాజాగా ఏ దేశం టిక్ టాక్ పై నిషేధం విధించింది.?
జ : నేపాల్
24) అంతర్జాతీయ మధుమేహ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ – 14
25) ఏ దేశ అధ్యక్షుడిపై ప్రాన్స్ ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.?
జ : సిరియా అధ్యక్షుడు బసర్ అస్సద్ పై
26) కేంబ్రిడ్జి డిక్షనరీ 2023వ సంవత్సరానికి గాను ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2023గా ప్రకటించింది.?
జ : Hallucinate
27) అబబీల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను ఇటీవల ఏ దేశం పరీక్షించింది.?
జ : పాకిస్తాన్
28) ఆల్ట్రా ప్రాసెసింగ్ ఫుడ్ (జంక్ ఫుడ్) పై అదనంగా 10 శాతం టాక్స్ విధించిన దేశం ఏది.?
జ : కొలంబియా
29) బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కానుకలుగా ఏమి అందించాడు.?
జ : గణపతి విగ్రహం, కోహ్లీ సంతకం చేసిన బ్యాట్
30) స్పెర్మ్ వేల్స్ రక్షణ కోసం ఏ దేశం ప్రత్యేక రిజర్వ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది.?
జ : డొమినికా
31) ఏ జీవుల వ్యాప్తి కారణంగా దక్షిణ కొరియా ఆరోగ్య శాఖ హైలెట్ ప్రకటించింది.?
జ : నల్లులు
32) ఏ దేశపు పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు పొగ బాంబులు వేసి, మంటలు పెట్టారు.?
జ : ఆల్బెనియా
33) ప్రపంచ టెలివిజన్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 21
34) ప్రపంచ మత్స్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 21
35) బ్రిక్స్ కూటమిలో చేరడానికి తాజాగా ఏ దేశం దరఖాస్తు చేసుకుంది.?
జ : పాకిస్తాన్
36) ఆసియన్ – ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్ 2023 ను భారత్ ఎక్కడ నిర్వహిస్తుంది.?
జ : జకర్తా (ఇండోనేషియా)
37) బ్రిటన్ విదేశీయులకు అందిస్తున్న వీసాలలో అత్యధికంగా ఏ దేశం వారు పొందుతున్నారు.?
జ : భారత్
38) అతి పెద్ద ఐస్‌బర్గ్ 40 సంవత్సరాల తర్వాత గ్లోబల్ వార్మింగ్ కారణంగా కదలడం ప్రారంభించింది దాని పేరు ఏమిటి.?
జ : A23A
38) భారతదేశంలో ఏ దేశపు రాయబార కార్యాలయాన్ని ఇటీవల పూర్తిగా మూసివేశారు.?
జ : ఆఫ్ఘనిస్తాన్
39) ఇటలీ లోని ఏ క్రియాశీల అగ్నిపర్వతం ఇటీవల విస్పోటనం చెందింది.?
జ : మౌంట్ ఎట్నా
40) నవంబర్ 30 నుండి కాప్ – 28 సదస్సు ఏ దేశంలో జరగనుంది.?
జ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
41) చైనా దేశంలో అంతుపట్టని నిమోనియా వ్యాధి పిల్లలకు వ్యాపించడానికి కారణమైన వైరస్ ఏది.?
జ : H9N2
42) అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 25
43) ప్రపంచ వారసత్వ వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు.?
జ : నవంబర్ 19 – 25 వరకు
44) మలేషియా దేశం ఏ దేశస్థులకు వీసా లేకుండానే తమ దేశం లోకి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది.?
జ : భారత్, చైనా
45) 2008 శాంతి నోబెల్ గ్రహీత ఇటీవల మరణించారు. ఆయన పేరు ఏమిటి.?
జ : మార్టి అహిత్సారి (పిన్లాండ్)
46) “స్త్రీలపై హింస నిరోధక దినోత్సవం” నవంబర్ 25న జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ ఏమిటి.?
జ : UNITE.! – Invest to prevent Violence against Women and Girl’s”
47) నవంబర్ 10న నిర్వహించే ప్రపంచ సైన్స్ దినోత్సవం 2023 యొక్క థీమ్ ఏమిటి.?
జ : BUILDING TRUST IN SCIENCE
48) ఆగ్నేయాసియలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే వ్యవస్థ ‘హూష్’ ను ఏ దేశం ప్రారంభించింది.?
జ : ఇండోనేషియా
49) దక్షిణాసియాలో తొలి స్వలింగ వివాహాన్ని అధికారికంగా చేసిన దేశం ఏది .?
జ : నేపాల్
50) నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, అమెరికా విదేశాంగ మంత్రి ఇటీవల కన్నుమూశారు ఆయన పేరు ఏమిటి?
జ : హెన్రీ కిసింజర్