BIKKI NEWS (NOV. 29) : INTERMEDIATE ONLINE ADMISSIONS IN TELANGANA. వచ్చే విద్యా సంవత్సరం నుండి తెలంగాణ ఇంటర్మీడియట్ లో ఆన్‌లైన్ పద్దతిలో అడ్మిషన్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
INTERMEDIATE ONLINE ADMISSIONS IN TELANGANA
పదో తరగతి మార్కుల ఆధారంగా ఇంటర్ ఫస్టియర్‌లో సీట్లు కేటాయిస్తారు. ఇందుకోసమే పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని రద్దుచేసి, మార్కుల విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లను దోస్త్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే చేపడుతున్నారు. ఇంటర్‌లో విద్యార్థులు సాధించిన మార్కులు, మెరిట్ ఆధారంగా విద్యార్థుల నుంచి ఆప్షన్లు స్వీకరించి, సీట్లు కేటాయిస్తున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ అడ్మిషన్లు ప్రక్రియ విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ని రకాల విద్యా సంస్థలకు ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ పరిధిలోకి తీసుకురానున్నారు.
ఇంటర్‌లోనూ ఆన్‌లైన్ అడ్మిషన్లు చేపట్టాలన్న డిమాండ్లున్నాయి. అయితే పదో తరగతిలో అమలుచేస్తున్న గ్రేడింగ్ ఆధారంగా ఇంటర్‌లో సీట్లు కేటాయించలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో పదో తరగతిలో నిరంతర సమగ్ర మూల్యాంకనం, గ్రేడింగ్ పద్ధతిని రద్దుచేశారు.
ఆన్‌లైన్ అడ్మిషన్లతో విద్యార్థి తనకు నచ్చిన కాలేజీలో.. నచ్చిన చోట చేరే వీలుంటుంది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్