INTERMEDIATE MODEL QUESTION PAPERS

BIKKI NEWS : క‌రోనా నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ సిల‌బ‌స్‌ను 30 శాతం తగ్గించిన విష‌యం విదిత‌మే. దీంతో ఇంట‌ర్ ప‌రీక్షల ప్ర‌శ్నాప‌త్రాల్లో స్వ‌ల్ప మార్పులు చేశారు. ఈ మేర‌కు ఇంట‌ర్ మోడ‌ల్ పేప‌ర్స్‌ను (INTERMEDIATE MODEL QUESTION PAPERS) ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. అన్ని స‌బ్జెక్టుల ప్ర‌శ్నాప‌త్రాల్లో మార్పులు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.

ఆల్ సబ్జెక్టుల మోడల్ పేపర్లు పైల్ ::

DOWNLOAD PDF

రెండు మార్కుల ప్ర‌శ్న‌లు ప‌దింటికి ప‌ది రాయాల్సి ఉంటుంది. 4 మార్కులు, 8 మార్కుల ప్ర‌శ్న‌ల్లో మార్పులు చేశారు. ఈ సెక్షన్ లలో 50 శాతం చాయిస్ ఇచ్చారు. మోడ‌ల్ పేప‌ర్స్ కోసం వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

http://www.tsbie.cgg.gov.in

ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను మే 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇంటర్నల్‌ పరీక్షలయిన ఎథిక్స్‌ అండ్‌ హ్యుమన్‌ వ్యాల్యూస్‌ పరీక్షను ఏప్రిల్‌ 1న, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షను ఏప్రిల్‌ 3న నిర్వహించనున్నామని చెప్పారు.