జియో టీవీ యాప్ లో ఇంటర్ తరగతులు

ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం జియో టీవీలో ఇంటర్మీడియట్ పాఠాలను ప్రసారం చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

జియో టీవీ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 8.30 గంటలవరకు విద్యార్థులు పాఠాలు వీక్షించవచ్చని, ఇవే పాఠ్యాంశాలను ఇంటర్‌ విద్యామండలికి చెందిన bieap virtual class అనే యూట్యూబ్‌ ఛానల్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ జియో టీవీ యాప్ ఉచితంగా ప్రతి మొబైల్ లో ప్లే స్టోర్ లో లభిస్తుంది.

త్వరలో ఇంటర్ పస్టీయర్ తరగతులతో పాటు JEE, EAMCET, NEET వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన తరగతులను కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రామకృష్ణ తెలిపారు.

Jio tv link :: https://play.google.com/store/apps/details?id=com.jio.jioplay.tv

BIE AP VIRTUAL CLASSES YOU TUBE LINK ::

https://www.youtube.com/channel/UCcosteRUr7ImR7_FfQ38xhA

Follow Us@