BIKKI NEWS (MAY 17) : intermediate exams remuneration hike issue. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష విధులు నిర్వహించే వారికి రెమ్యునరేషన్ పెంచాలని తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రీ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ గారికి ఆన్లైన్ లో వినతి పత్రం పంపించినట్లు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ -475, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ వస్కుల శ్రీనివాస్, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ లు తెలిపారు.
intermediate exams remuneration hike issue.
ఈనెల 22 నుంచి 29 వరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ ను తెలంగాణ ఇంటర్ బోర్డు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుందని, సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షల రాయటం జరుగుతుందని, అయితే ఈ విధులు నిర్వహించే వారికి గత మూడు సంవత్సరాలుగా రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఉన్న వాటినే చెల్లిస్తున్నారని, మూడు సంవత్సరాలకొకసారి రెమినరేషన్ పెంచే ఆనవాయితీ ఇంటర్మీడియట్ బోర్డు పాటిస్తుందని, పెరిగిన రవాణా చార్జీలు మరియు ఇతర ఖర్చుల వల్ల రెమ్యునరేషన్ పెంచాల్సిన అవసరం ఉన్నదని, ఈ విషయంపై గత నెలలో గౌరవ ఇంటర్ విద్యా కార్యదర్శి గారిని తమ సంఘము నుంచి కలిసి వినతి పత్రం ఇవ్వటం జరిగిందని, వారు చాలా సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం నిర్వహించబోయే ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ విధులు మరియు ఇంటర్ మూల్యాంకన విధులు నిర్వహించే వారికి రెమ్యునరేషన్ పెంచే విధంగా చూడవలసిందిగా వినతి పత్రంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా రెమ్యునరేషన్ చెల్లింపులు ఆలస్యం జరగకుండా, ఎటువంటి కోతలు విధించకుండా వెంటనే అందించాలని, త్వరలో నిర్వహించే ఇంటర్ మూల్యాంకన కేంద్రాల్లో, ఎండ తీవ్రత దృష్ట్యా ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేయాలని, మూల్యాంకన కేంద్రాలలో విధులు నిర్వహించే సిబ్బందికి కూల్ వాటర్ క్యాన్లు ఏర్పాటు చేయాలని కోరారు.
గత నెలలో ఈ విషయంపై గౌరవ కార్యదర్శి గారికి వినత పత్రం ఇవ్వగా వారు సానుకూలంగా స్పందించి వీటి ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ వినతి పత్రాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డు గౌరవ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా పంపించినట్లు తెలిపారు. రెమ్యూనరేషన్ పెంచే విషయంలో సానుకూలంగా ఉంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్