గతంలో ఇంటర్ పెయిల్ అయినా విద్యార్థులకు ఈ సంవత్సరం కరోనా కారణంగా రూపొందించే ప్రశ్నపత్రాలతోనే పరీక్ష నిర్వహించనున్నారు.
మే 1 నుంచి తెలంగాణలో జరిగే ఇంటర్ వార్షిక పరీక్షలకు కరోనా పరిస్థితుల నేపథ్యంలో 30 శాతం సిలబస్ తగ్గించడంతోపాటు ప్రశ్నపత్రాల్లో 50% ఛాయిస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానాన్నే గతంలో పెయిలై ప్రస్తుతం పరీక్షలు రాయనున్న విద్యార్థులకూ వర్తింపజేయనున్నారు.
గత మార్చి వార్షిక పరీక్షల్లో దాదాపు 4.80 లక్షల మంది ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయగా వారిలో 1.92 లక్షల మంది పెయిల్ అయ్యారు. వారికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించలేదు.
వచ్చే మే నెలలో ద్వితీయ సంవత్సరం పరీక్షలతో పాటే వీరు ప్రథమ సంవత్సరంలో తప్పిన సబ్జెక్టులను రాయనున్నారు. ఈ పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్, 50 శాతం ఛాయిస్ వర్తింపజేశారు. ఆయా విద్యార్థులు రెండు సంవత్సరాల పరీక్షలు ఒకేసారి రాయాల్సి ఉన్నందున ఒత్తిడికి లోనుకాకుండా ఈ అవకాశం కల్పించినట్లు అధికారులు తెలిపారు.
Follow Us@