Home > EDUCATION > INTERMEDIATE > INTER ENGLISH PRACTICALS : విధివిధానాలు

INTER ENGLISH PRACTICALS : విధివిధానాలు

హైదరాబాద్ (నవంబర్ 20) : ఇంటర్మీడియట్ లో ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ను టొఫెల్, ఐఈఎల్డీఎస్ వంటి ప్రతిష్టాత్మక పరీక్షలకు పునాది వేసే క్రమంలోనే ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు (intermediate english practicals Guidelines ) దాదాపుగా ఒక కొలిక్కి వచ్చాయి.

intermediate english practicals Guidelines

ఇంగ్లీషు ప్రాక్టికల్స్ లో భాగంగా మీకు ఇష్టమైన టీచర్, ఆటలు వంటి 30 అంశాలు గురించి ఒక నిమిషం పాటు మాట్లాడాలి. ఆ ఆంశం గురించి మీకు తెలిసిన విషయాలు, ప్రత్యేకతలపై 60 సెకండ్ల పాటు ప్రసంగించాలి.

ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ మూల్యాంకన పద్ధతుల్లో కమ్యూనికేటివ్ స్కిల్స్ లో భాగంగా జస్ట్ ఏ మినట్ (JAM), పరస్పరం సంభాషణ (ROLE PLAY) ఇక రోల్ ప్లేలో భాగంగా ఇద్దరు విద్యార్థులు ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు ఒక అంశంపై పరస్పరం సంభాషించాల్సి ఉంటుంది.

ప్రశ్నల కూర్పు ఇలా..

ఫస్టియర్ (2023 – 24)

SEC.A – 24
SEC.B – 08
SEC.C – 48
ప్రాక్టికల్స్ 20
మొత్తం : 100

సెకండ్ ఇయర్ (2023 – 24)

SEC.A – 40
SEC.B – 08
SEC.C – 52
ప్రాక్టికల్స్ : 00
మొత్తం : 100

ఇంటర్ స్థాయిలోనే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగు పరిచేందుకు ఇంటర్ బోర్డు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రాక్టికల్స్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విద్యార్థులకు 80 మార్కుల థియరీ, 20 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలుంటాయి. థియరీలో 28 మార్కులు, ప్రాక్టికల్స్ 7 మార్కులు సాధిస్తే ఉత్తీర్ణులైనట్టు లెక్కలోకి తీసుకొంటారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు