ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభం వాయిదా

  • అందుబాటులో ఉన్న సిబ్బందితో అడ్మిషన్ల ప్రక్రియ

కరోనా సెకండ్ వేవ్ మరియు లాక్ డౌన్ పరిస్థితులలో జూన్ 1నన ప్రారంభం కావాల్సిన 2021 – 2022 ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరాన్ని వాయిదా వేశారు. జూనియర్ కళాశాలల పునః ప్రారంభ తేదీని తర్వాత ప్రకటిస్తామని ఇంటర్మీడియట్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే నూతన విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించగా, అడ్మిషన్ల ప్రక్రియను సజావుగా జరపడానికి ఆన్లైన్ మరియు ఇతర పద్దతులలో అడ్మిషన్లు జరపాలని ఇందుకోసం కళాశాల యొక్క నాన్ టీచింగ్ సిబ్బంది మరియు అందుబాటులో ఉన్న టీచింగ్ సిబ్బంది తో అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగించాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.

Follow Us@