Home > EDUCATION > INTERMEDIATE > INTER BOARD EXAMS – తప్పనిసరిగా హజారు కావాల్సిన బోర్డు పరీక్షలు

INTER BOARD EXAMS – తప్పనిసరిగా హజారు కావాల్సిన బోర్డు పరీక్షలు

BIKKI NEWS (FEB. 14) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలు మరియు పర్యావరణ విద్య పరీక్ష మరియు ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షలను ఈ నెలలో (INTERMEDIATE BOARD EXAMS WHICH ARE COMPULSORY ATTEND) నిర్వహించనుంది.

ఫిబ్రవరి 16న ఇంగ్లీషు ప్రాక్టికల్ పరీక్షలు, నైతికత & మానవ విలువలు పరీక్ష 17వ తేదీన, పర్యావరణ విద్య పరీక్ష 19వ తారీఖున నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించనున్నారు.

ఎథిక్స్ అండ్ హ్యుమన్ వాల్యూస్ పరీక్ష ప్రస్తుతం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రాయాల్సిన అవసరం లేదు. గతంలో ఈ పరీక్ష ఫెలైన విద్యార్థులు ఈసారి ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష రాయడానికి ఇదే చివరి అవకాశం కావున గతంలో ఈ పరీక్ష హాజరుకాని ఫెయిల్ అయిన విద్యార్థులు ఈసారి తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుంది.

ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరు కావలసి ఉంటుంది. ఈ పరీక్షలకు హాజరు కాకుండా, ఉత్తీర్ణత సాధించకుండా ఫైనల్ ఎగ్జామ్ లో అన్ని సబ్జెక్టులు పాస్ అయినప్పటికీ సర్టిఫికెట్ ఫెయిల్ అని వస్తుంది. కావున అభ్యర్థులు కచ్చితంగా ఈ బోర్డు పరీక్షలకు హాజరు కావలసి ఉంటుంది