అడ్మిషన్ల సంఖ్య లక్ష దాటించడానికి కాంట్రాక్టు అధ్యాపకులు కృషి చేయాలి – కొప్పిశెట్టి సురేష్

  • ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్సాహంగా చేరుతున్న విద్యార్థుల

ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సుమారు 70 వేల మంది పైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందడం జరిగిందని, జూలై మధ్య నాటికి మరింత ఉత్సాహంతో ఒక లక్ష వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు చేరుకోవడానికి కాంట్రాక్టు అధ్యాపకులు కృషి చేయాలని కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ అడ్మిషన్ల ప్రక్రియలో సహకరిస్తున్న జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్, హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులకు , అధికారులకు, అధ్యాపక మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎక్కువ అడ్మిషన్లు చేయాలని కోరుకుంటున్నట్లు 475 సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థుల అడ్మిషన్లు ప్రారంభమైనవి. జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరే విధంగా కృషి చేయాలని కోరుతూ, ప్రభుత్వ డిగ్రీ & జూనియర్ కళాశాల వర్ధిల్లాలని కోరుకుంటూ, వాటి అబివృద్దిలో పాలుపంచుకుంటున్న కాంట్రాక్టు అధ్యాపకులకు సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.