EAPCET 2023 : ఎపీ ఎంసెట్ లో ఇంటర్ కు వెయిటేజ్

విజయవాడ (ఎప్రిల్‌ – 23) : ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET 2023 (AP EAMCET) లో ఇంటర్మీడియట్ మార్కులకు ఈ ఏడాది 25% వెయిటేజీ కొనసాగిస్తున్నారు. గతంలో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించకపోవడంతో వెయిటేజీ తొలగించారు. ఈ ఏడాది ఇంటర్ మార్కులు 25% వెయిటేజీని పునరుద్ధరించారు.

EAPCET 2023 లో వచ్చే మార్కులు 75%, ఇంటర్మీడియట్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు కేటాయిస్తారు. ఇంటర్మీడియట్లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరనే నిబంధన ఉంది.