ఇంటర్ వొకేషనల్ షార్ట్ టెర్మ్ కోర్సుల పరీక్షల షెడ్యూల్ విడుదల

ఇంటర్ వొకేషనల్ షార్ట్ టెర్మ్ కోర్సులలో 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. షార్ట్ టెర్మ్ కోర్సులలో 3 నెలలు, 6 నెలలు, 9 నెలల కోర్సులలో సర్టిఫికెట్ కోర్సులు ఉంటాయి.

ఈ పరీక్షలను మూడు మాడ్యులలో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

  • మాడ్యులు – 1 : జూలై 30 -2021 ఉదయం 10:00 నుండి 12:00 గంటల వరకు
  • మాడ్యులు – 2 : జూలై 30 -2021 ఉదయం 2:00 నుండి 4:00 గంటల వరకు
  • మాడ్యులు – 3 : జూలై – 31 -2021 ఉదయం 10:00 నుండి 12:00 గంటల వరకు నిర్వహించనున్నారు.

విద్యార్థులు జూలై 24వ తేదీ నుంచి హల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

స్టేట్ ఇన్సిస్టిట్యూట్ ఆప్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎయిడెడ్ ప్రైవేటు జూనియర్ ఎన్జీవో ఇన్స్టిట్యూట్ లకు ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు