ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సుల ప్రథమ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలు డిసెంబర్ – 03 నుండి డిసెంబర్ 07 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన లో తెలిపింది
2020 – 21 విద్యా సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ద్వితీయ చదువుతున్న ఈ విద్యార్థులకు తాజాగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ప్రాక్టికల్ పరీక్షలు ముగిసిన తరువాతనే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Follow Us @