IVC : ఒకేషనల్ విద్యార్థులకు పాలిటెక్నిక్ రెండో సంవత్సరంలో అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 01) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ/ఎయిడెడ్/ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో 3 సంవత్సరాల వ్యవధి డిప్లొమా (ఇంజనీరింగ్ మరియు నాన్-ఇంజనీరింగ్) కోర్సులలో 2వ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం నిమిత్తం అర్హులైన ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. (Inter vocational courses pass outs lateral entry into polytechnic courses)

◆ అర్హత : ఇంటర్మీడియట్ విద్యా మండలిచే నిర్వహించబడిన రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ (ఒకేషనల్) కోర్సులో ఉత్తీర్ణులై ఉండవలెను మరియు సంబంధిత బ్రిడ్జి (మ్యాథ్స్, ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ పాఠ్యాంశాలతో) నందు ఉత్తీర్ణులై ఉండవలెను.

◆ దరఖాస్తు గడువు : జూన్ – 02 నుండి 09 – 2023 వరకు

◆ దరఖాస్తు ఫీజు : 330/-

◆ వెబ్సైట్ : https://sbtet.telangana.gov.in