వైభవంగా ఇంటర్ విద్య స్వర్ణోత్సవ వేడుకలు

50 వసంతాలను పూర్తి చేసుకున్న ఇంటర్ విద్య స్వర్ణోత్సవాలను ఇంటర్ విద్య జేఏసీ సౌజన్యంతో సిద్దిపేటలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా ఈ రోజు జరిగిన విషయం తెలిసిందే.

ఈ సభను ఉద్దేశించి ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మదుసుధన్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యను పీవీ నరసింహారావు ప్రారంభించారని దానివలన ఎంతో మంది విద్యార్థులు తమకు నచ్చిన రంగంలో స్థిరపడడానికి ప్లాట్ ఫాంగా ఉన్నదని తెలిపారు.

జాతీయ స్థాయి పరీక్షలలో నీట్, ఐఐటీ, జేఈఈ వంటి వాటిలో తెలుగు విద్యార్థులు అధికంగా విజయం సాధించిండానికి కారణం ఇంటర్ విద్య అని తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇంటర్ విద్యా అందించడం, మరియు కళాశాల అధ్యాపక సిబ్బంది కృషి కారణంగా ఇంటర్ విద్యార్థుల సంఖ్య 60 వేల నుండి రెండు లక్షలకు చేరిందని వివరించారు.

నూతన విద్యా విధానం ఇంటర్మీడియట్ విద్యకు ఉత్ప్రేరకంగా పని చేస్తుందని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్లు, ఎంటీఎస్, కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణ అంశం విషయాలను త్వరగా, అలాగే అతిథి అధ్యాపకుల రెన్యూవల్ అంశాల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి కి మదుసుధన్ రెడ్డి విన్నవించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న రెగ్యులర్ మరియు కాంట్రాక్టు అధ్యాపకుల పోస్టులను కాకుండా మిగతా పోస్టులను ఖాళీలుగా చూపించి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని పేర్కొన్నారు.

అలాగే ఎయిడెడ్ కళాశాలలను ప్రభుత్వం రక్షించాలని కొరారు.

అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మరియు, ప్రతి విద్యా సంవత్సరం ఆరంభంలో విద్యార్థికి 500/- చొప్పున ఇవ్వాలని కోరారు.

ఈ అంశాలపై స్పందించిన మంత్రి హరీశ్ రావు వీలయినంత త్వరగా అన్ని సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మదుసుధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షుడు కృష్ణ కుమార్, లైబ్రేరియన్స్‌సంఘం అధ్యక్షుడు, ఎయిడెడ్ కళాశాల సంఘం అధ్యక్షుడు, కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు కనకచంద్రం పాల్గొన్నారు.

Follow Us @