ఇంటర్ విద్యా స్వర్ణోత్సవాలకు తరలిరండి – కనకచంద్రం

ఇంటర్ విద్యా స్వర్ణోత్సవాలను ఇంటర్ విద్యా జేఏసీ తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు, ఇంటర్మీడియట్ కమిషనర్ శ్రీ ఉమర్ జలీల్ లు ముఖ్య అతిథులుగా జనవరి 02 – 2021, శనివారం రోజున సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కనక చంద్రం, ప్రధాన కార్యదర్శి శేఖర్ లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అధ్యాపకులు అధిక సంఖ్యలో పాల్గొని మన సమస్యలను హరీష్ రావు గారికి విన్నవించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మన సమస్యలను పరిష్కరించుకుందామని కనక చంద్రం పిలపునిచ్చారు.

ఇంటర్ విద్యా జేఏసీ తరఫున నిర్వహించే స్వర్ణోత్సవాల సభ ఉదయం 10 గంటల నుంచి 1 గంటలకు ముగుస్తుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనే అధ్యాపకులకు ఆన్ డ్యూటీ (OD) తో పాటు జిల్లాల నుంచి బస్/వెకిల్ సౌకర్యం కలదని, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జిల్లాలో కోఆర్డినేషన్ చేసుకోవాలని కోరారు.

కార్యక్రమం ముగిసిన తర్వాత రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో ఒప్పంద అధ్యాపకులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు భవిష్యత్ కార్యాచరణపై చర్చించి తీర్మానించడం జరుగుతుందని తెలిపారు.

Follow Us@