ఇంటర్విద్యా స్వర్ణోత్సవాల నేపథ్యంలో ఇంటర్విద్యా పై ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ డా. మదుసుధన్ రెడ్డి గారి వ్యాసం.

ఇంటర్విద్యా ఆవిర్భావం ::

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ 1969- 70 విద్యాసంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభమైంది. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ జరగక ముందు ఉన్న సర్కారు జిల్లాలు గాని, నిజాం పరిపాలించిన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సంబంధించినటువంటి జిల్లాలో గాని హయ్యర్ సెకండరీ అని ప్రీ యూనివర్సిటీ కోర్స్ అని వివిధ రకాల పేర్లతో, అంతరాలతో కూడిన విద్యా వ్యవస్థ గందరగోళంగా ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో విద్యా విధానంపై 1966లో కొఠారి కమిషన్ సిఫార్సులు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. ఆనాటి ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖమంత్రి స్వర్గీయ పీవీ నరసింహరావు గారు విద్యా వ్యవస్థలో ఒక సమున్నతమైనటువంటి మార్పు తీసుకురావాలనే సదుద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యా వ్యవస్థలను పరిశీలించి, రాష్ట్రంలో ఉన్నటువంటి 8 యూనివర్సిటీల ఉపకులపతులు, విద్యావేత్తలతో 1968 జూలై 7, 8 తేదీలలో జూబ్లీహాల్లో విద్యా సదస్సును ఏర్పాటు చేసి, ఆ సదస్సు తీర్మానానికి అనుకూలంగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రాష్ట్రంలో అంకురార్పణ చేయడం జరిగింది.

★ విద్యార్థుల భవిష్యత్తు కు ప్లాట్ ఫాం ఇంటర్విద్యా ::

ముఖ్యంగా పాఠశాల విద్యకు కళాశాల విద్య కు ఒక రకమైన ప్రత్యేక సంబంధాన్ని కొనసాగిస్తూనే ఇంటర్మీడియట్ విద్యనుకొన్ని మౌళిక మార్పులను ఇనుమడింప జేసీ దీన్ని గేట్ వే ఆప్ హయ్యర్ ఎడ్యుకేషన్ ల రూపొందించడం జరిగింది. ఈ ఇంటర్విద్యా వ్యవస్థ అనేది సమాజానికి అవసరమైన రంగాలలో నిపుణులను అందించే అనగా విద్యార్థులు భవిష్యత్తులో ఏ రంగంలో రాణించాలని అనుకుంటున్నారో అనగా డాక్టర్, ఇంజనీర్ లేదా అడ్వకేట్ కావలెను అనేది నిర్ణయం తీసుకునే గొప్ప ప్లాట్ ఫాం ఈ ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను ఆనాటి విద్యావేత్తల తీర్మానం నిర్ణయించిన మేరకు రూపొందించడం జరిగింది.

★ ఇంటర్మీడియట్ లేకపోతే ఎంసెట్ లేదు ::

దేశ వ్యాప్తంగా ఉన్న విద్యావిధానంలో 9వ 10వ, 11వ 12వ తరగతులు హై స్కూల్ మరియు హయ్యర్ సెకండరీ హై స్కూల్ ఎడ్యుకేషన్ బోధించేవారు. దీనికోసం పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, గ్రాడ్యుయేట్ టీచర్లు ఉండేవారు అయితే 1969 – 70 లో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ప్రారంభించిన తర్వాత మరియు1983 లో ఎంసెట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ లేకపోతే ప్రస్తుతం ఎంసెట్ ఏ రూపంలో ఉండేదో కూడా ఊహించలేము. ఆ తర్వాత 1971 లో యాక్ట్ – 2 ఆప్ – 1971 ప్రకారం ఇంటర్మీడియట్ విద్యా మండలిని రూపొందించడంతో దాదాపు 20 మంది విద్యార్థులతో ఇంటర్మీడియట్ విద్య హైయర్ సెకండరీ స్కూల్ లలో మరియు కాంపోజిట్ డిగ్రీ కళాశాలలో ప్రారంభమవడం జరిగింది.

★ ఇంటర్విద్య కు ప్రాణం పోసిన పీవీ నరసింహారావు ::

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ప్రారంభించిన తర్వాత క్రమంగా ఇది విస్తరిస్తూ వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ శాఖ అధ్వర్యంలో నడుస్తున్నటువంటి సందర్భంలో పెద్దఎత్తున ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు అదేవిధంగా ప్రభుత్వ కళాశాలలు ఎర్పడటం జరిగింది. 1971లో పీవీ నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో ప్రపంచంలోనే ఒక నూతన మైనటువంటి ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. రెసిడెన్షియల్ విద్యా వ్యవస్థ ను ప్రారంభించడం తద్వారా కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్ వంటి సంస్థలను ప్రారంభించడం ద్వారా ప్రభుత్వ విద్యా రంగంలో ఒక నూతన మైనటువంటి ఉత్సాహానికి ఇంటర్మీడియట్ విద్య ఒక ప్లాట్ ఫారంగా మారింది.

ఈరోజు సమాజంలో ఉన్నత స్థానలలో ఉన్న డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు పైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుగారు ఏపీ తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ మాజీ చీఫ్ కమిషనర్ భుపాల్ రెడ్డి, బుర్రా వెంకటేశం, నాగిరెడ్డి ఐపీఎస్ ఇలా చాలామంది ఈ యొక్క విద్యా విధానం ద్వారా ఉన్నత స్థానలలోకి రావడం జరిగింది.

★ జీవో నంబర్ 343 ద్వారా ఇంటర్విద్యకు స్వతంత్ర ప్రతిపత్తి

ఈ సందర్భంగా పాఠశాల విద్య మరియు కళాశాల విద్య అనేవి రెండుగా విడిపోయి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేటటువంటి ఒక శాఖ డైరెక్టర్ మ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ గా విభజించడం జరిగింది.

డైరెక్టరేట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కింద ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు డిగ్రీ విద్యా రావడం జరిగింది. ఈ సందర్భంలోనే 1986లో యూనివర్సిటీ గ్రాంట్స్ పే కమిషన్ ఎర్పడటం, దేశవ్యాప్తంగా డిగ్రీ కళాశాలు అటనామస్ లేదా యూనివర్సిటీకి అప్లియోటేడ్ కాలేజెస్ గా ఉండడం. ఎక్కడ ఏ కళాశాలల్లో కూడా ఈ ప్లస్ టు ఎడ్యుకేషన్ లేకపోవడం ప్లస్ టు టీచర్లు డిగ్రీ కాలేజీలో డిగ్రీ కాలేజ్ టీచర్లు ప్లస్ టూ కు బోధించడం వంటి గందరగోళం పరిస్థితులు ఏర్పడటంతో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను మళ్ళీ మార్చాలని 343 జీవో ద్వారా డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మరల కమీషనరేట్ ఆప్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కమీషనరేట్ ఆప్ కాలేజియోట్ ఎడ్యుకేషన్ గా విభజించారు. 343 జీవో కింద ఇంటర్మీడియట్ విద్యను మొత్తం పర్యవేక్షించడం గ్రామీణ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో కళాశాల లేనటువంటి ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించడానికి ఒక ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది.

★ ఎంసెట్ రాకతో కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి ఇంటర్విద్యా ::

1983 లో ఎంసెట్ ప్రారంభం కావడంతో ఇంటర్మీడియట్ కళాశాలలకు ప్రాధాన్యత పెరగటం ముఖ్యంగా ఎంసెట్ కోచింగ్ కు ప్రాధాన్యత పెరగడం జరిగింది. ఆంధ్ర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబడిన కొన్ని కోచింగ్ సెంటర్లు కళాశాలలుగా కార్పొరేట్ కళాశాలలుగా రూపాంతరం చెందినవి. కాల క్రమంలో హైదరాబాద్ నగరంలో కూడా కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ప్రవేశం జరిగింది. గతంలో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఉన్నటువంటి వైభవం ఎదయితే ఉందో కార్పొరేట్ కళాశాల యొక్క ప్రభావం అనేది పెరిగిపోవడంతో క్రమంగా క్షీణీస్తోంది. ఈ కార్పోరేట్ కళాశాలలు విజయవాడ శ్రీ చైతన్య, విజయవాడ నలంద, గుంటూరు వికాస్ ఈ విధంగా ఊర్లు, వ్యక్తుల పేర్లతో అనేక సంస్థలు సుమారు 25 సంస్థలు ఏర్పాటు చేసి కాల క్రమంలో కూడా కాలగర్భంలో కలిసిపోయి ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ లాంటి రెండు సంస్థలు మాత్రమే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను ఏకఛత్రాధిపత్యంగా ఏలడం అనేది కాయిన్ కి మ‌రో కోణంగా చూడాలి.

★ జాతీయ స్థాయి పరీక్షలలో తెలుగు విద్యార్థుల జయకేతనానికి కారణం ఇంటర్విద్య ::

ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యావ్యవస్థ టెన్ ప్లస్ టూ కు, మన ఇంటర్మీడియట్ విద్యా విధానంకు ముఖ్యంగా ఉన్న తేడా ఏమిటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో భాగస్వామ్యం లేకపోవడం వల్ల విద్యార్థి ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెకండ్, ఇయర్ లోపల ఒక నూతన మైనటువంటి నేను కళాశాల విద్యార్థిని అని ఒక భావన రావడం మరియు రెండవది కేవలం రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ ను అకడమిక్ విద్యగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో రాష్ట్రీయ అదేవిధంగా నేషనల్ ఎగ్జామ్స్, ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ కావడానికి అవకాశం ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ కల్పిస్తుంది.

ముఖ్యంగా మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ గాని లేకపోతే గాని పీజీటి లు ఒకటి లేదా రెండు సబ్జెక్టులను 9వ‌, 10వ‌ 11వ, 12వ తరగతులకు బోధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమంది మ్యాథమెటిక్స్ మరియు లాంగ్వేజ్ కూడా ప్లస్ టూ విధానం లో బోధిస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ఇంటర్మీడియట్ విద్యలో సబ్జెక్టుల స్పెషలైజేషన్ ఏర్పడడం వల్ల బయాలజీ బోటనీ, జువాలజీ గా, పిజికల్ సైన్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ట్స్ ఎకానమిక్స్ కామర్స్ గా స్పెషలైజేషన్ పొంది సబ్జెక్టుకు ఒక అధ్యాపకుడే ఉండడంతో దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్య గుర్తింపు వచ్చింది సిలికాన్ వ్యాలీ తీసుకున్న ఐఐటీలు ఎన్ఐటీల్లో తీసుకున్న 50% స్టూడెంట్స్ కచ్చితంగా తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారంటే దాని యొక్క కీర్తి దానికి కారణం ఇంటర్మీడియట్ విద్య అనడంలో ఎవరికి కూడా ఎలాంటి సందేహం అవసరం లేదు.

ప్రతిష్టాత్మకమైన జవహర్ నవోదయ పాఠశాలలు దగ్గర నుంచి, భారతీయ విద్యా భవన్ లాంటివి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లాంటివి మరియు కేంద్రీయ విద్యా సంఘటన్ స్కూల్ ,కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్, స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కూడా ఎక్కడ కూడా విద్యార్థులను విద్యార్థులను పదవ తరగతి తర్వాత ప్లస్ టూ కు రిటేయిన్ చేయలేకపోతున్నాయి. కారణం ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్.

ఇంటర్మీడియట్ విద్యా మండలి ముందుచూపుతో 1971 లో స్వతంత్ర ప్రతిపత్తితో ఏర్పాటు చేయడంతో జాతీయస్థాయి పరీక్షల్లో అదే విధంగా సిలబస్ ప్రత్యేకీకరణ సాధించడం అనేక రాష్ట్రాల్లో బయలాజికల్ సైన్స్ బోధిస్తుంటే మనం బోటనీ జువాలజీ గా బోధించడం అలాగే CBSE 12వ తరగతి విద్యార్థుల కంటే మన ఇంటర్మీడియట్ విద్యార్థులు మ్యాథమెటిక్స్ స్కిల్స్ లో చాలా అడ్వాన్స్ గా ఉండటం చేత విద్యార్థికి ఫౌండేషన్ అనేది బలంగా ఉండండ ఇంటర్మీడియట్ విద్యా విధానం వలన జరిగింది. ఈ కారణంగానే జాతీయ స్థాయి పరీక్షలు అయిన నీట్, జేఈఈ, నిట్, ఐఐటీలో మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 50% పైగా విజయం సాధిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క ప్రమేయం కావచ్చు విద్యార్థులకు సంబంధించి మానసిక ఒత్తిళ్లు ఉండడం మరోక కోణం.

★ బడుగు బలహీన వర్గాలకు వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు గురుకుల జూనియర్ కళాశాలలు ::

ఈ కార్పొరేట్ కళాశాలు ఒత్తిళ్లు నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చినవి. తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు లక్షల మంది విద్యార్థులు ఉచితంగా చదువుకోవడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేకపోతే వారి ఆర్థిక పరిస్థితి కారణంగా కచ్చితంగా చదువుకు దూరమయ్యే పరిస్థితి. అదే సందర్భంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలు మరియు గురుకుల కళాశాలలుగా, అదేవిధంగా ప్రైవేట్ రంగంలో రెసిడెన్షియల్ ఈ విధంగా అనేక రకాలుగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ విస్తృతంగా విస్తరించింది.

ఇదే సందర్భంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత విద్య అందించడం, అదేవిధంగా ప్రైవేట్ విద్యాసంస్థల పట్ల అనేక రకాల నియంత్రణ కార్యక్రమాలు గాని, ఈ విధంగా 20 వేల మంది విద్యార్థులతో ప్రారంభమైన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు పది లక్షల మంది ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి ఉత్తీర్ణత సాదించడం సంతోషం. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జాతీయ స్థాయి పరీక్షలలో మన తెలుగు విద్యార్థులు విజయం సాధించి కీర్తి ప్రతిష్టలు సాధించడమనే పరిస్థితి మనం చూడడమనేది కూడా మన అందరి అదృష్టం.

★ నూతన విద్యా విధానంతో మరింత మెరుగుపడనున్న ఇంటర్విద్య ::

రేపు రాబోయే రోజుల్లో నూతన విద్యా విధానం 2021 కారణంగా స్పెషలైజేషన్ ఎంపిక అనేది 9వ తరగతి నుంచే విద్యార్థి ఎంచుకునే అవకాశం కల్పిస్తుంది.అదేవిధంగా ఈ NEP 2020 అనేది సబ్జెక్ట్ స్పెషలైజేషన్ కల్పిస్తుంది. ఇప్పటికీ మనం ఏదైతే MPC, BPC, CEC, HEC అంటూ సాంప్రదాయం చదువుకోవడం జరుగుతుందో అవన్నీ కూడా సుమారు 40 50 గ్రూపులు కింద విడిపోయి ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ అనేటటువంటి భేదం భావం లేకుండా విద్యార్థి మూడింటిని కూడా కలిపి చదివే అవకాశం ఉంటుంది.

ఎవరైనా కెమిస్ట్రీ మాత్రమే చదవాలి అనుకుంటే అది జరగడానికి అవకాశం ఉండే విధంగా ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ లను 9వ తరగతి నుంచే ఎంచుకునే అవకాశం ఉంది. అలాగే తెలుగు, ఎకనామిక్స్, మేథమెటిక్స్ చదవాలి అనుకుంటఘ చదివే అవకాశంఉంది. ఇలా మల్టీ డిసిప్లినరీ విద్యా వ్యవస్థకు ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ చాలా అనుకూలమైనది ఉంటుంది అనడంలో సందేహం లేదు.

★ ఇంంటర్విద్యా పితామహుడు పీవీ కి నివాళి సిద్దిపేట ఇంటర్విద్యా స్వర్ణోత్సవ సభ ::

పీవీ నరసింహారావు గారి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగానే, 50 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య స్వర్ణోత్సవాలు కూడా జరుపుకోవడం ఆయనకు నిజమైన నివాళి అర్పించడమే అవుతోంది. ఈ విధంగా దేశానికి ఆర్థిక సంస్కరణలే కాదు విద్యా సంస్కరణలు కూడా తీసుకుని రావడానికి పీవీ నరసింహారావు చేసిన కృషి ఆయన ముందు చూపును ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ సిద్దిపేట వేదికగా 50 వసంతాల ఇంటర్విద్యా స్వర్ణోత్సవ వేడుకలు జరపడం జరుగుతుంది.

దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటర్మీడియట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను.

ఈ సభ కేవలం ప్రారంభం మాత్రమే తర్వాత కూడా జిల్లాస్థాయిలో అదేవిధంగా కళాశాల స్థాయిలో సభలు నిర్వహించి, ఇంటర్మీడియట్ విద్య యొక్క ప్రాముఖ్యత పైన పెద్ద ఎత్తున చర్చ జరగాలి. అలాగే విద్యార్థులకు అవగాహన కల్పించాలని కోరుతున్నాను.

అదేవిధంగా ఇంటర్మీడియట్ విద్య ఇప్పటివరకు ఎటువంటి పరిణామాలను పొందింది మరియు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, ఇంకా భవిష్యత్తులో ఎలాంటి మార్పులు తీసుకు వస్తే బాగుంటుంది వీటన్నింటిపై సమగ్ర చర్చ చేయడానికి సిద్దిపేట స్వర్ణోత్సవ వేదిక ఒక ఉదాహరణగా నిలుస్తుంది. దీనిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్య మీద పెద్ద ఎత్తున చర్చ జరగాలని కోరుకుంటున్నాను.

పీవీ నరసింహారావు గారి యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగానే, 50 సంవత్సరాల ఇంటర్మీడియట్ విద్య స్వర్ణోత్సవాలు కూడా జరుపుకోవడం ఆయనకు నిజమైన నివాళి అర్పించడమే అవుతోంది.

డా. మదుసుధన్ రెడ్డి, ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్.

వ్యాసకర్త ::

డా. మదుసుధన్ రెడ్డి, తెలంగాణ ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్.

Follow Us @