జూన్ లో సీజేఎల్స్ బదిలీలు – ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి

బదిలీ బాధితుల పక్షాన నూనె శ్రీనివాస్, మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ఆన్లైన్ గూగుల్ మీట్ సమావేశంలో ఇంటర్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బదిలీ బాధితులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ఇంటర్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హామీ మేరకు జూన్ మాసంలో బదిలీలు జరుగుతాయని ఫిబ్రవరిలో జరగాల్సిన బదిలీలను విద్యా సంవత్సరం చివరికి చేరడంతో జరగలేదని పేర్కొన్నారు.

జూన్ మాసంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని ఈ నేపథ్యంలో ఎవరు అడ్డుకున్నా ఐదు లేదా ఆరు సంవత్సరాల టైం ప్రేమతో ఆన్లైన్ విధానంలో బదిలీలు జరుగుతాయని తెలిపారు.

ఏ శక్తి బదిలీలను అడ్డుకోలేదని తెలిపారు. జిల్లా స్థాయిలో బదిలీలకు అవకాశం లేదని జోనల్ స్థాయిలోనే బదిలీలు జరుగుతాయని తెలిపారు.

బదిలీలు మార్గదర్శకాలు దాదాపు తయారయ్యాయని ఆన్లైన్ విధానంలో బదిలీలు జరిపేందుకు బోర్డు సిద్ధంగా ఉందని తెలిపారు.

ఇంటర్ విద్య జేఏసీ తరపున ఐదు సంవత్సరాల గరిష్ట సర్వీసు రెండు సంవత్సరాల కనిష్ఠ సర్వీస్ తో బదిలీలు జరగాలని తమ అభిప్రాయం అని తెలిపారు.

సీజేఎల్స్ సంఘాలకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చని కానీ బదిలీలు అనే అంశం కచ్చితంగా ఒక నిర్దిష్టమైన టైమ్ ప్రేమ్ తో జరుగుతుందని తెలిపారు.

బదిలీలు బదిలీ బాధితుల కోసం కాదని వ్యవస్థ బాగు కోసం అని తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరం సిలబస్ తగ్గింపు ఉండదని కావునా జూన్ మాసంలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందని, నూతన విద్యా సంవత్సరంలో బదిలీ బాధితులు నూతన కళాశాలలో ఉంటారని తెలిపారు.

వచ్చే రెండు మూడు వారాలలో బోర్డు నుంచి బదిలీల మీద ప్రకటన వచ్చేలా కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

Follow Us @