ఇంకా అందని ఇంటర్ మూల్యాంకన పైసలు – క్యాంపు అధికారిదే బాధ్యత : TIGLA

BIKKI NEWS (MAY 14) : INTER SPOT VALUATION REMUNERATION NOT CREDITED. మార్చి నెల 18 వ తారీఖు నుండి ఏప్రిల్ 10 వరకు ఎల్ బి కళాశాల వరంగల్ (క్యాంపు నెం.35) క్యాంపులో ఇంటర్ మూల్యాంకనం జరిగింది. ఈ క్యాంపులో విధులు నిర్వహించిన వందలమంది అధ్యాపకులకు ఇతర సిబ్బందికి నేటి వరకు రెమ్యూనరేషన్ అందకపోవడంతో వారందరూ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

INTER SPOT VALUATION REMUNERATION NOT CREDITED

గౌ. బోర్డు సెక్రటరీ గారు మూల్యాకనం పూర్తయిన వారం రోజులలో డబ్బులు మీ అకౌంట్ లలో పడతాయని గతంలో మాటిచ్చారని అదేవిధంగా కొన్ని క్యాంపులలో డబ్బులు చెల్లించారని, కానీ ఎల్ బి కళాశాల వరంగల్ క్యాంపు (నెం.35) అధికారుల నిర్లక్ష్యం మరియు అశ్రద్ధ వలన నేటికి డబ్బులు అందలేదని వారు వాపోతున్నారు. 

మూల్యాంకనం ముగిసి నెలరోజులు దాటినా ఇంకా రెమ్యూనరేషన్ చెల్లించకపోవడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.  ఈనెల 22 నుండి మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతున్నాయని మార్చిలో జరిగిన పరీక్షల మూల్యాంకనం తాలూకు రెమ్యూనరేషన్
ఇప్పటివరకు అందక పోవడం శోచనీయం. మాల్యాంకనం విధులకు హాజరైన సిబ్బందికి ఇంకా రెమ్యూనరేషన్ అందకపోవడంతో వారు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

యల్ బి కాలేజ్ క్యాంపు నెం.35 లో పనిచేసిన వారి రెమ్యూనరేషన్ ను వెంటనే ఇప్పించవలసిన బాధ్యత క్యాంపు అధికారిదే అని వారి నిర్లక్ష్యం వల్లే ఇంత ఆలస్యం అవుతుందని టీగ్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నయీమ్ పాష ఆరోపించారు.

ఇంటర్ బోర్డు అధికారులు కలుగజేసుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కరించి రెమ్యూనరేషన్ పైసలు అందరికి అందేలా చూడాలని గౌ.COE గారికి మరియు బోర్డు సెక్రటరీ గారికి TIGLA సంఘ రాష్ట్ర నాయకులు మైలారం జంగయ్య, నయీమ్ పాష విజ్ఞప్తి చేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు