గిరిజన గురుకులాల్లో 11న ఇంటర్ స్పాట్ అడ్మిషన్లు

కరీంనగర్ (జూలై – 09) : తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయటానికి జూలై 11న స్పాట్ అడ్మిషన్ (spot admissions in tstwries)నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ సమన్వయ అధికారి డి.ఎస్. వెంకన్న ఒక ప్రకటనలో శనివారం పేర్కొన్నారు.

హుస్నాబాద్ గురుకుల జూనియర్ ప్రతిభా కళాశాలలో ఎంపీసీ 8, బైపీసీ 10.

సిరిసిల్ల గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు)లో ఎంపీసీ 20, బైపీసీ 21.

వేములవాడ గురుకుల జూనియర్ కళాశాల (బాలికలు)లో ఎంపీసీ 35, బైపీసీ 35 ఖాళీలకు స్పాట్ అడ్మిషన్లు జరగనున్నాయి.

ఆసక్తి గల గిరిజన విద్యార్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలతో నేరుగా గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల సిరిసిల్లలోని సారంపల్లిలో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.