త్వరలో ఇంటర్ ప్రాక్టికల్స్ ఆన్లైన్ తరగతులు – ఇంటర్ బోర్డు.

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం భౌతిక తరగతులు ఆలస్యం కావడంతో ఇంటర్ ప్రాక్టికల్స్ తరగతులు కూడా ఆన్లైన్ లో వివరిస్తూ బోధించినున్నట్లు ఇంటర్ వర్గాలు తెలిపాయి. కావున విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ప్రాక్టికల్స్ లో జంబ్లింగ్ విధానంలో కాకుండా సాధారణ పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం భౌతిక తరగతులు ఆలస్యం కావడంతో సెప్టెంబరు ఒకటి నుండి డి డి యాదగిరి, టీ శాట్ ఛానల్ ద్వారా ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు చెబుతున్న విషయం తెలిసిందే. అలాగే ఫిబ్రవరి 1 నుండి భౌతిక తరగతులు ప్రారంభం అయినప్పటికీ తక్కువ సమయం ఉండటంతో భౌతికంగా తరగతులు నిర్వహిస్తూనే, ఆన్లైన్ పాఠాలను డి డి యాదగిరి ఛానల్ టీ శాట్ ఛానల్ నందు ప్రసారం చేస్తున్నారు.

Follow Us@