ఇంటర్ జనరల్, వొకేషనల్ డిజిటల్ తరగతుల షెడ్యూల్

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులు సౌకర్యార్థం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం లో అతి ముఖ్యమైన ప్రశ్నలు సమాధానాలతో కూడిన వీడియో తరగతులు వీడియో తరగతులను టీ శాట్ ద్వారా ప్రసారం చేసి విద్యార్థులలో పరీక్షలకు మానసిక స్థైర్యం నింపడానికి ఇంటర్మీడియట్ బోర్డు మ షెడ్యూల్ విడుదల చేసింది.

ద్వితీయ సంవత్సరం అతిముఖ్యమైన ప్రశ్నలతో కూడిన వీడియోలను ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, ప్రథమ సంవత్సరంసాయంత్రం 5.00 నుండి 8.30 వరకు టీ శాట్ విద్యా చానల్ ద్వారా ప్రసారం చేయనున్నారు.

అలాగే ప్రాక్టికల్స్ కు సంబంధించిన వీడియోలను 12, 13, 19, 20
తేదీలలో ప్రసారం చేయనున్నారు.

కావున జిల్లా ఇంటర్ విద్యాధికారులు, ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, విద్యార్థులు పై టైం టేబుల్ ప్రకారం టీ శాట్ చానల్ ద్వారా వీడియో తరగతులను చూసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటన జారీ చేసింది.

వొకేషనల్ ప్రథమ సంవత్సరం తరగతులు టీ శాట్ నిపుణ చానల్ ద్వారా ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు….

వొకేషనల్ ద్వితీయ సంవత్సరం తరగతులు టీ శాట్ నిపుణ చానల్ ద్వారా సాయంత్రం 7.00 నుండి 9.00 గంటల వరకు ప్రసారమగును.

అలాగే ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక యూట్యూబ్ ఛానల్ అయిన “DEPARTMENT OF INTERMEDIATE E – LERANING TELANGANA” ద్వారా కూడా డిజిటల్ తరగతులు విద్యార్థులు వీక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Follow Us @