పాఠశాల విద్యలో ఇంటర్ విద్య విలీనానికి రంగం సిద్ధం.!

జాతీయ నూతన విద్యా విధానం 2020 ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటుంది. ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వాడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. కొత్త జాతీయ విద్యా విధానానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ఇక నుంచి 12 తరగతుల వరకు స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోనికి తీసుకురానునున్నది. దీనితో ఇంటర్మీడియట్ బోర్డు పరిధి పై స్పష్టత ఇవ్వవలసి ఉంటుంది.

జాతీయ విద్యా విధానంలో క్లస్టర్ విద్యా విధానానికి అధికంగా ప్రాధాన్యత ఇవ్వనుంది. ఉన్న వనరులను పూర్తిస్థాయిలో వాడుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సమీపంలో ఉన్న స్కూల్స్, కాలేజెస్, గ్రౌండ్స్, లైబ్రరీ మౌలిక వసతులను పూర్తిస్థాయిలో వినియోగించడంపై దృష్టి సారించారు.