ఇంటల్ పస్టీయర్ ఫెయిల్ అయిన విద్యార్థులను కూడా పాస్ చేసే యోచనలో బోర్డు.

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ పాస్‌మార్కులు వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించాలని ఇంటర్‌బోర్డు అధికారులు ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

2020లో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో(IPE – 2020) 1.92 లక్షల మంది ఫస్టియర్‌ విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. వీరికి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో సాద్యం కాలేదు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు కనీస మార్కులు వేసి ఉత్తీర్ణులుగా ప్రకటించారు. ఇదే తరహాలో ఫస్టియర్‌ వారిని సైతం ఉత్తీర్ణులుగా ప్రకటించాలన్న డిమాండు ఉన్నది.

దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఆమోదం రాగానే నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

Follow Us@