అక్టోబర్ 25 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు, షెడ్యూల్ ఇదే.

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ను అక్టోబర్ 25 నుండి నవంబర్ 2 వరకు నిర్వహించనున్నారు.

దీనికి సంబంధించిన షెడ్యూల్ ను ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. 70 శాతం సిలబస్ తో ఈ పరీక్షలు జరపనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుంది. పూర్తిగా వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సిబ్బందితో మాత్రమే పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు.

ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులు కూడాఇదే షెడ్యూల్ వర్తిస్తుందని కాకపోతే త్వరలో ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన కూడా ప్రత్యేకంగా షెడ్యూల్ విడుదల చేస్తామని.. అలాగే ప్రాక్టికల్ సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేస్తామని తెలిపారు

Follow Us @