విజయవంతంగా ముగిసిన ఇంటర్ మూడవ రోజు పరీక్షలు – బోర్డ్

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో బాగంగా మ్యాథమెటిక్స్ – 1A, బోటనీ -1, పొలిటికల్ సైన్స్ -1 పరీక్షలు విజయవంతంగా ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

మొత్తం ఈ పరీక్షలకు ఈ రోజు 4,58,557 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 4,29,972 మంది విద్యార్థులు హజరు కాగా, 28,585 మంది (6.2%) గైర్హాజరు అయ్యారని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన లో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని బోర్డు తెలిపింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1768 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ రోజు పరీక్షల రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులు కరీంనగర్, మహాబూబునగర్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారని బోర్డు ప్రకటించింది.