ఇంటర్ పరీక్ష పేపర్లలో మరింత పెరిగిన చాయిస్

ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షల్లో ప్రశ్నల చాయిస్ ను అన్ని సెక్షన్ లలో పెంచారు. గతంలో కొన్ని సెక్షన్లలో మాత్రమే చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా, ఈ ఏడాది అన్ని సెక్షన్లలో ప్రశ్నల సంఖ్యను పెంచారు. 2021-22 సంవత్సరానికి తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియాల మాదిరి ప్రశ్నపత్రాలను ఇంటర్ బోర్డు అధికారులు వెబ్సైట్ లో పెట్టారు. గతేడాది మూడు సెక్షన్లకుగాను రెండింటిలో మాత్రమే 50 శాతం చాయిస్ ప్రశ్నలు ఇవ్వగా.. ఇప్పుడు మూడు సెక్షన్లలో చాయిస్ ప్రశ్నలిచ్చారు. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో అత్యధికులు ఫెయిల్ కావడంతో చాయిస్ ప్రశ్నలు పెంచి మోడల్ ప్రశ్నపత్రాలను సిద్ధంచేశారు.

పేపర్లవారీగా చాయిస్..

• గణితం సెక్షన్ – ఏలో 15 ప్రశ్నలకు గాను పదిం టికి సమాధానాలు రాయాలి. ఐదు ప్రశ్నలను చాయిస్ గా వదిలేసుకొనే అవకాశమిచ్చారు. గతేడాది ఈ సెక్షన్లో మొత్తం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉండేది. సెక్షన్ – బీలో 11 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఆరు ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్ – సీలో 9 ప్రశ్నలు ఉంటాయి. ఐదింటికి సమాధానాలిస్తే సరిపోతుంది. నాలుగు ప్రశ్నలు చాయిస్. .

• ఆర్ట్స్ సబ్జెక్టులలో సెక్షన్ – ఏలో ఏడు ప్రశ్నలకు మూడింటికి సమాధానాలు రాయాలి. నాలుగు ప్రశ్నలు చాయిస్. సెక్షన్ – బీలో 17 ప్రశ్నల్లో 8 సమాధా నాలు రాయాలి. 9 ప్రశ్నలు వదిలేయవచ్చు. సెక్షన్ -సీలో 15 ప్రశ్నలకు సమాధానం రాయాలి. 24 ప్రశ్నలిచ్చారు. 9 ప్రశ్నలు వదిలేసు కోవచ్చు.

సైన్స్ సబ్జెక్టు లలో సెక్షన్ – ఏలో 10 ప్రశ్నలకు సమాధానాలివ్వాలి. 15 ప్రశ్నలు ఇస్తారు. ఐదు చాయిస్. సెక్షన్ – బీలో 14 ప్రశ్న లకు ఆరింటికి సమాధానమిస్తే సరిపోతుంది. సెక్షన్ – సీలో నాలుగింటిలో రెండింటికి సమా ధానం ఇవ్వాలి.

ఇంగ్లిష్ లో సెక్షన్ – ఏలో ఐదు ప్రశ్నలిచ్చారు. రెండింటికి సమాధానం రాయాలి. సెక్షన్ – బీలో ఆరు ప్రశ్నలకుగాను నాలుగింటికి సమాధానాలిస్తే సరిపోతుంది. సెక్షన్ – సీలో 50 శాతం ప్రశ్నలను చాయిస్ గా ఇచ్చారు.

• తెలుగులో సెక్షన్ – 1 లో 8 మార్కుల ప్రశ్నలు మూడిచ్చి ఒకటి రాసుకొనే అవకాశమిచ్చారు. సెక్షన్ – 2, 3లలో 6 మార్కుల ప్రశ్నలు మూడింట్లో ఒకదానికి సమాధానమిస్తే సరిపో తుంది. సెక్షన్ – 4లో 4 మార్కులవి 5 ప్రశ్నలి వ్వగా, రెండింటికి, సెక్షన్ 5, 6లలో 3 మార్కులవి 6 ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలివ్వాలి. సెక్షన్ 7, 8లలో 2 మార్కులవి ఐదు ప్రశ్నల్లో రెండింటికి సమాధానాలు రాయాలి. సెక్షన్ 9, 10లలోనూ చాయిస్ ప్రశ్నలను పెంచారు.

credits – ntnews

Follow Us @