ఇంటర్ పరీక్షలు రెండో రోజూ ప్రశాంతం – ఇంటర్ బోర్డ్

రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పబ్లిక్ పరీక్షలలో బాగంగా పస్ట్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్ష విజయవంతంగా ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1768 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం ఈ పరీక్షలకు 4,59,240 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా ఈ పరీక్షకు 4,30,563 మంది విద్యార్థులు హజరు అయ్యారని, 6.2% విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటన లో తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాలేదని బోర్డు తెలిపింది.

ఈ రోజు తెలంగాణ విద్యా కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మరియు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ లు మహర్షి వేద విజ్ఞాన కళాశాల – హైదరాబాద్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నట్లు ప్రకటించారు.