జూన్‌ 1న ఇంటర్‌ పరీక్షలపై నిర్ణయం.!

కేంద్ర మంత్రులు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో ఆదివారం రక్షణ శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గితే జూన్‌ నెలాఖరులో ఇంటర్‌ ద్వితీయ సంవత్సర పరీక్షలను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని తెలంగాణ విద్యా శాఖ అధికారులు తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో దాదాపు 9.50 లక్షల మంది ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలపై స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు.

అవకాశం ఉంటే జూన్‌ నెలాఖరులో పరీక్షలు జరుపుతామని, లేని పక్షంలో ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించుకుంటున్నామని ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా వారికి చెప్పినట్లు తెలిసింది. రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు లేకుంటే ప్రథమ సంవత్సరం పరీక్షల్లో మార్కుల ఆధారంగా ఇవ్వడం లాంటి వాటిని పరిశీలిస్తున్నామని వివరించినట్లు సమాచారం. ఈ ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించిన ప్రభుత్వం జూన్‌ 1న సమీక్షించి అప్పటి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us@