BIKKI NEWS (MARCH. 03) : తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్ లకు గురవుతున్న వార్తలు రోజు వస్తున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్షలు అత్యంత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడక్కడ చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు విధులలో నిర్వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్ లకు (Inter exams employees suspensions in telangana) గురవుతున్నారు.
ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో ఇద్దరు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇద్దరు, సిద్దిపేట జిల్లాలో ముగ్గురు చొప్పున ఉద్యోగులను ఇంటర్మీడియట్ బోర్డ్ సస్పెన్షన్ కు గురిచేసింది. మొత్తం 7 గురి మీద మొదటి నాలుగు రోజుల్లో సస్పెన్షన్ విధిస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
చీఫ్ సూపరింటెండెంట్ మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్ల దగ్గర సైతం సెల్ ఫోన్ లేకుండా నిషేధం విధిస్తూ ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ణయం తీసుకుంది
మాల్ ప్రాక్టీస్ సహకారం అందించడం, ప్రశ్నాపత్రాలను ఫోటోలు – వీడియోలు తీయడం, పరీక్ష కేంద్రంలో సంబంధిత సబ్జెక్టు లెక్చరర్ ఉండటం వంటి కారణాల వలన పై సస్పెన్షన్లను విధించడం జరిగింది.