నేటితో ముగియనున్న ఇంటర్ అడ్మిషన్ల గడువు

తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల్లో పస్టీయర్ అడ్మిషన్ల గడువు ఈరోజుతో అనగా నవంబర్ 30 తో ముగియనుంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అడ్మిషన్ల గడువును మూడు సార్లు పొడిగించడం జరిగింది… మరల గడువు పొడిగించడం అనుమానమే…

చివరిసారిగా గడువు నవంబర్ 16 తో ముగిస్తే మరల నవంబర్ 19 న మరోసారి గడువు పొడిగిస్తున్నట్లు బోర్డు ఉత్తర్వులు జారీ చేయడంతో నవంబర్ 30 వరకు గడువు పెరిగింది..

కావునా ఇప్పటికి కూడా అడ్మిషన్లు తీసుకోని విద్యార్థులు వెంటనేజూనియర్ కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవాలని సూచించారు.

ఇప్పటికే కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఇంకా పూర్తిగా ప్రారంభం కానీ నేపథ్యంలో, ఆప్ లైన్ తరగతులు డిసెంబర్ నెలలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్న తరుణంలో మరొక్కమారు అడ్మిషన్ల గడువు పెంచడం అనేది సందేహమే.

చదవండి ::

ఇంటర్మీడియట్ ఆన్లైన్ తరగతులపై తాజా మార్గదర్శకాలు

Follow Us@