BIKKI NEWS (MARCH 29) : Inter board secretary krishna aditya visited valuation camp. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీ కృష్ణ ఆదిత్య, ఐ.ఎ.ఎస్., గారు ఈరోజు కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన (వాల్యుయేషన్) క్యాంపును సందర్శించారు.
Inter board secretary krishna aditya visited valuation camp
ఈ సందర్భంగా క్యాంపులో జరుగుతున్న జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను సమీక్షించి, ఎగ్జామినర్ ల పనితీరును పరిశీలించారు. సమయపాలన పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో విద్యార్థులకు న్యాయంగా మార్కులు కేటాయించేందుకు ప్రతి ఎగ్జామినర్ జాగ్రత్త వహించాలని సూచించారు. మూల్యాంకన కేంద్రంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మూల్యాంకన విధిని అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. క్యాంప్ నిర్వహిస్తున్న వివిధ ప్రక్రియలను పరిశీలించి, సిబ్బందికి మూల్యాంకన ప్రక్రియలో తగిన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
రేపు ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని మూల్యాంకన కేంద్రాల సిబ్బందికి సెలవు ప్రకటిస్తూ, శుభాకాంక్షలు తెలియజేశారు. సెలవు అనంతరం, వాల్యుయేషన్ మరింత సమర్ధవంతంగా కొనసాగించి నిర్ణీత గడువులోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్