ఇంటర్ పరీక్షలు రద్దు చేయకుంటే ‘ఇంటర్ బోర్డు ముట్టడి’ – పేరెంట్స్ అసోసియేషన్

ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులకు వారు ప్రమోట్ అయిన ఫస్టియర్ (2020-21) పరీక్షలు నిర్వహణను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ (TPA) రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

వచ్చే సోమవారం విద్యా శాఖ మంత్రి, ఉన్నత విద్యా కార్యదర్శి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శులను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, ఒకవేళ ప్రభుత్వం పరీక్షల రద్దు మీద సానుకూలంగా స్పందించకుంటే “ఇంటర్ బోర్డు ముట్టడి” కార్యక్రమం చేపడతామని టీపీఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. నారాయణ హెచ్చరించారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో TPA అధ్యక్షుడు ఎన్. నారాయణ, TIPS కన్వీనర్ M. రామకృష్ణ గౌడ్, TIGLA అధ్యక్షుడు M. జంగయ్య, కాంట్రాక్ట్ లెక్చరర్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. కొప్పిశెట్టి సురేష్, టెక్నికల్ ఫ్యాకల్టీ సంతోష్ తదితరులు మాట్లాడారు.