జూలై 22, 23న ఇంటర్ బోర్డు పరీక్షలు

హైదరాబాద్ (జూలై 21) : ఇంటర్మీడియట్ ఇంటర్నల్ పరీక్షలు అయిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, శనివారం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను జూలై 22, 23 తేదీల్లో నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకు కొనసాగుతాయి.

ఈ పరీక్షల ప్రశ్నపత్రాలను ఆన్లై న్లో పొందుపరిచినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ప్రిన్సిపల్ లాగిన్ ఐడీ నుంచి ప్రశ్నపత్రాలను పొందవచ్చని పేర్కొన్నారు.

గతంలో ఈ పరీక్షలు వ్రాయని, ఫెయిల్ అయిన విద్యార్థులు తమ కళాశాలలోనే ఈ పరీక్షలు వ్రాయవచ్చు. ఈ పరీక్షలు రాయకున్న, ఫెయిల్ అయిన మెయిన్ సబ్జెక్టులన్ని పాస్ అయినా ఇంటర్మీడియట్ మెమోలో ఫెయిల్ అనే వస్తుంది.

Follow Us @