గుర్తింపు పొందని కళాశాల జాబితా ప్రకటిస్తాం : నవీన్ మిట్టల్

హైదరాబాద్ (జూన్ – 17) : తెలంగాణ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కళాశాలలు ఈ నెలాఖరులోపు అవసరమైన దృవపత్రాలు అందించాలని లేదంటే అనుమతులు నిరాకరించడంతోపాటు వాటి జాబితాను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు.

కళాశాలలు తెరిచే నాటికి 2,700 కళాశాలలకు అనుమతి ఇచ్చామని… అనుబంధ గుర్తింపు లేని కళాశాలలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇతర కళాశాలలో చేరేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.

మొత్తం 3,100 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 2,884 కళాశాలలకు అనుమతి ఇచ్చామని… అందులో 1,259 ప్రైవేట్ కళాశాలలో దరఖాస్తు చేసుకోగా 1,195 కళాశాలలో అనుమతి పొందాయని… ఇంకా 64 ప్రైవేట్ కళాశాలలో అనుమతి పొందాల్సి ఉందని పేర్కొన్నారు.