ప్రభుత్వ కళాశాలలోనే చేరండి – ఇంటినుండే ఇంటర్ అడ్మిషన్ – ఇంచార్జి ప్రిన్సిపాల్ శెతి నందిని పటేల్

తెలంగాణా ఇంటర్మీడియట్ బోర్డు కమీషనర్ ఓమర్ జలీల్ ఆదేశాల ప్రకారం విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తు కొరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ధర్మకంచ, జనగాం నందు అడ్మిషన్స్ పొందాలని కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ శ్రీమతి శెతి నందిని పటేల్ కోరారు.

కళాశాల గురించి మాట్లాడుతూ విద్యార్థులకు ఉచిత అడ్మిషన్, ఉచిత పాఠ్యపుస్తకాలు, స్కాలర్ షిప్ సౌకర్యం ఉందని మరియు అనుభవజ్ఞులైన ఉత్తమ అధ్యాపకులచే Zoom App ద్వారా భోధన, Whatsapp ద్వారా విద్యార్థులను ప్రత్యేకంగా పరిశీలన చేయడం జరుగుతుందని తెలిపారు.

కరోనా తీవ్రత మరియు లాక్ డౌన్ మూలంగా SSC పాస్ ఐనా విద్యార్థులను మరియు వారి తల్లి తండ్రులను ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశ్యం తో ఇంటి వద్ద నుండే అడ్మిషన్ పొందవచ్చునని, జనరల్ గ్రూపులో MPC., BiPC., CEC., HEC.,తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం, BiPC ఉర్దూ మీడియంలు, ఒకేషనల్ విభాగంలో A&T., OA., AET., MPHW(F)., MLT కోర్స్ లు కలవు.

అడ్మిషన్ల కొరకు ::

https://forms.gle/hr4iYAuaxipiucAD7

పై లింక్ ద్యారా అడిగే సమాచారం గూగుల్ ఫామ్ లో హల్ టికెట్ నెంబర్, SSC GPA, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్, గ్రూప్, మీడియం, విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, పుట్టిన తేది, అడ్రస్ ను సబ్మిట్ చేయడం ద్వారా అడ్మిషన్ పొందవచ్చును.

కళాశాలలోని ఇతర సౌకర్యాలు, అడ్మిషన్స్ వివరాల కొరకు ఈ 9959235551, 8919217926, 8686089144, 9347877828, (కార్యాలయ సిబ్బంది విష్ణు 9849196957 ) నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ శెతి నందిని పటేల్ సూచించారు.

Follow Us@