కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో భౌతిక తరగతులు నిర్వహించ లేకపోవడం వలన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరానికి (2021-22) గాను 70 శాతం సిలబస్ లోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
భౌతిక తరగతులు పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోవడం, భౌతిక తరగతులు ఆలస్యం కావడం, కొన్ని తరగతులు డిజిటల్ తరగతుల రూపంలో డిడి యాదగిరి టీశాట్ ద్వారా ప్రసారం చేయడం మరియు ప్రథమ సంవత్సరం పరీక్షలను గత నెలలో నిర్వహించడం వంటి కారణాల వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
70శాతం సిలబస్ కు సంబంధించిన వివరాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
