INTEGRATED BEd : తెలంగాణలో మూడు కళాశాలలో అడ్మిషన్లు

హైదరాబాద్ (జూన్ – 08) : డిగ్రీతో పాటు బీఈడీ కోర్సును ఒకేసారి అభ్యసించేందుకు దేశవ్యాప్తంగా 41 విద్యాసంస్థలకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సుల నిర్వహణకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

ఇందులో తెలంగాణ రాష్ట్రంలో మూడు విద్యాసంస్థలకు చోటు దక్కింది. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మోడల్ డిగ్రీ కళాశాలతో పాటు వరంగల్ ఎన్ఐటి, హైదరాబాదులోని ఉర్దూ వర్సిటీలో ఈ కోర్సులు ఈ విద్యాసంస్థల నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మూడు కళాశాలలో కలిపి 350 సీట్లు ఉన్నాయి. జాతీయ పరీక్షల సంస్థ ద్వారా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తారు. ఈ నెల చివరి వారంలో ఇంటిగ్రేటెడ్ బిఈడి ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.