డిగ్రీ తో పాటే బీఈడీ కోర్స్ కూడా పూర్తి.

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరం (2021-22) నుంచి డిగ్రీ కోర్సుల్లో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఇంటర్‌ తర్వాత నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ (డిగ్రీ + బీఈడీ) కోర్సును ప్రవేశపెట్టాలని జాతీయ విద్యావిధానంలో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టింది.

రాష్ట్రంలోని నారాయణఖేడ్, కల్వకుర్తి, భూపాలపల్లి, లక్షెట్టిపేటలలో నిర్మించిన ప్రభుత్వ మోడల్‌ డిగ్రీ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఆ కోర్సు సిలబస్‌ తయారీ విధివిధానాల పై రూసా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఇప్పటికే ఉస్మానియా, పాలమూరు, కాకతీయ విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లతో చర్చించినట్లు సమాచారం.

ఇంటిగ్రేటెడ్‌కోర్సు అంటే ఒకేసారి డిగ్రీ + బీఈడీ చదవవచ్చు. మొదటి మూడేళ్లలో డిగ్రీ సబ్జెక్టులతో పాటు బీఈడీకి సంబంధించి ఒక సబ్జెక్టు ఉంటుంది. చివరి ఏడాది మాత్రం పూర్తిగా బీఈడీకి సబ్జెక్టు లు మాత్రమే ఉంటాయి.

సాధారణంగా మూడేళ్ల డిగ్రీ తర్వాత రెండేళ్ల బీఈడీ చదివితే మొత్తం అయిదేళ్లు పడుతుంది. కానీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సులో నాలుగేళ్లలో డిగ్రీతోపాటు బీఈడీ సర్టిఫికెట్ పొందవచ్చు.

Follow Us@